ఈ నెల 9న తిరుమలకు మోడీ రాక.. భద్రత కట్టు దిట్టం

ఈ నెల 9న తిరుమలకు మోడీ రాక.. భద్రత కట్టు దిట్టం
x
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 9న తిరుమల రానున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని హోదాలో రెండోసారి స్వామివారిని...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 9న తిరుమల రానున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని హోదాలో రెండోసారి స్వామివారిని దర్శించుకోనున్నారు. ప్రధాని రానుండటంతో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. టీటీడీ, పోలీసు శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. అడుగడుగున తనిఖీలు ముమ్మరం చేశారు.

దేశ ప్రదాని హోదాలో నరేంద్ర మోడీ రెండోసారి తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు మోడీ తిరుమలకు వస్తున్నారు. 9వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక విమానంలో ప్రదాని మోడీ తిరుపతి ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. పద్మావతి అతిగృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అదేరోజు సాయంత్రం ఆరు గంటలకు తిరుమల శ్రీవానిరి దర్శించుకుంటారు. షెడ్యూల్ ప్రకారం గంటా 15 నిమిషాల పాటు ఆలయంలో గడపనున్నారు. స్వామివారి దర్శన అనంతరం తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీకి ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం పలుకడానికి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల రానున్నారు. ప్రదాని మోడీ పర్యటన నేధ్యంలో తిరుమలలో భద్రత కట్టు దిట్టం చేశారు. ఎస్.పీ.జీ బలగాలు తిరుమలకుచేరుకున్నాయి. గ్రేహౌండ్స్, స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్, బాంబు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది అడుగడున తనిఖీలు చేస్తున్నారు. మరో వైపు ఆక్టోపస్ బలగాలు ఆయుధాలతో ఆలయ నాగులు మాఢవీధుల్లో భద్రత పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని విశ్రాంతి తీసుకోనున్న పద్మావతి అతిధిగృహం దగ్గర 50 మందికి పైగా పోలీసులు పహారా కాస్తున్నారు. ప్రదాని ప్రయాణించే రహాదారులు, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories