logo

మహాత్ముడికి ఘన నివాళులర్పించిన ప్రముఖులు

మహాత్ముడికి ఘన నివాళులర్పించిన ప్రముఖులు
Highlights

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గాంధీ వర్ధంతి సందర్భంగా దేశ రాజధాని...

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గాంధీ వర్ధంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.


లైవ్ టీవి


Share it
Top