రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రదానం

రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రదానం
x
Highlights

2019 పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పద్మ అవార్డులను ప్రదానం చేశారు. మొత్తం 112 మంది విజేతల్లో ఈరోజు 56...

2019 పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పద్మ అవార్డులను ప్రదానం చేశారు. మొత్తం 112 మంది విజేతల్లో ఈరోజు 56 మందికి రాష్ట్రపతి పురస్కారాలు అందించారు. రాష్ట్రపతి భవన్‌ లో పద్మశ్రీ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. 2019 సంవత్సరానికిగాను 112 మందికి పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించగా ఇవాళ 56 మందికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు.

సినీ రంగం నుంచి ప్రభుదేవా, శంకర్ మహదేవన్, మోహన్ లాల్, శివమణి, సిరివెన్నెల సీతారామశాస్త్రీ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. క్రీడల నుంచి క్రికెటర్ గౌతం గంభీర్, ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ, చదరంగం క్రీడాకారిణి హారికా ద్రోణవల్లి పురస్కారాలు స్వీకరించారు. వ్యవసాయవేత్త వెంకటేశ్వర రావు యడ్లపల్లికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఇక ప్రముఖ జర్నలిస్ట్ కుల్‌దీప్ నయ్యార్ కు మరణానంతరం పద్మ భూషన్ దక్కింది. ఈ అవార్డును ఆయన భార్య భారతి అందుకున్నారు. మిగిలిన వారికి ఈనెల 16న జరిగే తదుపరి కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories