గోవా కొత్త సీఎంగా ప్రమోద్ సావంత్..

గోవా కొత్త సీఎంగా ప్రమోద్ సావంత్..
x
Highlights

గోవా తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా,...

గోవా తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో జరిగిన బీజేఎల్పీ సమావేశంలో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సావంత్‌‌ను ఎన్నుకున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న నాయకుల్లో ప్రమోద్‌ ఎంపికకే ఎక్కువ అవకాశాలు ఉండడంతో ఆయన్ను తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేఎల్పీ ఎన్నుకొంది.

గోవా ఫార్వార్డ్ పార్టీ చీఫ్ విజయ్ సర్దేశాయ్‌, మహారాష్ట్ర గోమంతక్ పార్టీ ఎమ్మెల్యే సుదీన్ ధవాలికర్‌లు గోవా ఉప ముఖ్యమంత్రులుగా పదవులను అలంకరించనున్నారు. ఉప ముఖ్యమంత్రుల పదవులకు ఈ రెండు పార్టీలు పట్టుబట్టడం బీజేపీ దానికి అంగీకరించడంతో ఆ పార్టీలు గతంలో మాదిరిగానే బీజేపీ అండగా నిలిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories