సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌‌పై అధిష్టానం తొలిసారి కన్నెర్ర

సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌‌పై అధిష్టానం తొలిసారి కన్నెర్ర
x
Highlights

కీలకమైన ఎన్నికల వేళ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అధిష్టానానికి చికాకు పుట్టిస్తున్నాయి. జాతిపిత మహాత్మ గాంధీతో పాటు నాథూరాం గాడ్సే వ్యవహారంలో...

కీలకమైన ఎన్నికల వేళ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అధిష్టానానికి చికాకు పుట్టిస్తున్నాయి. జాతిపిత మహాత్మ గాంధీతో పాటు నాథూరాం గాడ్సే వ్యవహారంలో వివాదాస్పద కామెంట్స్ చేసిన నేతలపై బీజేపీ అధిష్టానం కన్నెర్ర చేసింది. ఈ వ్యవహారంలో ముగ్గురు నేతల వ్యాఖ్యలు వారి వ్యక్తగత మంటూనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పోలింగ్‌ ముంగిట్లో ఓటర్ల ఆగ్రహానికి గురి కాకుండా క్రమశిక్షణ పేరిట నోటీసులు జారీ చేసింది.

వివాదాస్పద కామెంట్స్‌తో బీజేపీ అధిష్టానానికి తలనొప్పులు తెచ్చి పెడుతూ ప్రతిపక్షానికి కావాల్సినంత ముడి సరకు అందిస్తున్న భోపాల్‌ లోక్‌సభ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌‌పై అధిష్టానం తొలిసారి కన్నెర్ర చేసింది. ఓవైపు ప్రతిపక్షాల విమర్శలు మరోవైపు అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలు పార్టీకి చేటు తెస్తాయని భావించిన పార్టీ అధ్యక్షుడు అమిత్‌‌షా, ప్రధాన మంత్రి నరేంద్రమోడీలే నేరుగా రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టారు. ప్రజ్ఞాసింగ్‌తో పాటు కేంద్రమంత్రి అనంత్ కుమార్‌ హెగ్డే, ఎంపీ నళని కుమార్‌ కతీల్‌లకు క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తక్షణమే వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో కోరింది. క్రమశిక్షణ, కట్టుబాట్లను తప్పి ప్రవర్తిస్తే ఎవరినైన చర్యలు తీసుకుంటామంటూ అధినేత అమిత్ షా ప్రకటించారు.

జాతిపిత గాంధీజీని బీజేపీ అవమానిస్తోందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై అమిత్‌షా స్పందించారు. జాతిపిత మహాత్మగాంధీ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న పార్టీ తమదేనన్నారు. స్వచ్ఛ భారత్ తో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టిన ఘనత తమదేనన్నారు. కాంగ్రెస్ మాటలు చెబితే తాము ఆచరణలో పాటించి చూపామని ఆయన అన్నారు. హేమంత్ కర్కరేపై చేసిన వ్యాఖ్యల వివాదం కొనసాగు తుండగానే మరో వివాదం రాజేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలు ఓటర్లతో పాటు మిత్రపక్షాల్లో వ్యతిరేకత పెంచే ప్రమాదముందని కమలనాధులు కలత చెందుతున్నారు. ఈ నేపధ్యంలోనే పరిస్థితులు చేయి దాటకముందే పగ్గాలు వేసినట్టు ఢిల్లీ పోలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories