ఏపీ, తెలంగాణ మధ్య మరో కొత్త యుద్ధం

ఏపీ, తెలంగాణ మధ్య మరో కొత్త యుద్ధం
x
Highlights

ఏపీ, తెలంగాణ మధ్య మరో కొత్త యుద్ధం మొదలైంది. తమ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించాలని సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పడంపై తెలంగాణ...

ఏపీ, తెలంగాణ మధ్య మరో కొత్త యుద్ధం మొదలైంది. తమ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించాలని సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పడంపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం కావాలని అసత్యాలు చెబుతోందని మండిపడుతోంది. అసలు తెలంగాణ విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందా..? లేదా.. ?

ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు తెలంగాణ విద్యుత్ శాఖలో దుమారాన్ని రేపింది. విద్యుత్ బకాయిలు తమకు 5వేల కోట్లు చెల్లించాలని చెప్పడం వివాదాస్పదమైంది. అయితే, తెలంగాణ ప్రభుత్వంపైనా, తెలంగాణ విద్యుత్ సంస్థలపై ఏపీ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తోందని విద్యుత్ శాఖ అధికారులు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వానికే ఏపీ సర్కార్ రూ.2,600 కోట్లు చెల్లించాలని, రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాలపై ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదని గుర్తు చేస్తున్నారు.

విద్యుత్ సమస్యలపై రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తే తామెంత బాకీ ఉన్నామో 24గంటల్లో చెల్లిస్తామని తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఏపీ సర్కార్ తెలంగాణకు బకాయి ఉంటే తక్షణం చెల్లించేలా ఒప్పందం చేసుకుందామని సవాల్ చేస్తున్నారు. మొత్తానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య డేటా వార్‌తో పాటు కొత్తగా పవర్ వార్ మొదలైంది. మరి ఈ సమస్యలకు ఎలా పరిష్కారం దొరుకుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories