విశాఖలో కాకరేపుతున్న కొత్త వివాదం...సబ్బం హరి...

విశాఖలో కాకరేపుతున్న కొత్త వివాదం...సబ్బం హరి...
x
Highlights

విశాఖ తీరంలో మరో కొత్త వివాదం కాకరేపుతుంది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ప్రలోభాలు జరుగుతున్నాయంటూ వస్తున్న వార్తాలకు బలం చేకురుతుంది. భీమిలి అభ్యర్ధి...

విశాఖ తీరంలో మరో కొత్త వివాదం కాకరేపుతుంది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ప్రలోభాలు జరుగుతున్నాయంటూ వస్తున్న వార్తాలకు బలం చేకురుతుంది. భీమిలి అభ్యర్ధి సబ్బం హారి ఆడియో కాన్ఫిరేన్స్ టేప్‌ ఇప్పుడు విశాఖ రాజకీయాలను వేడెక్కిస్తోంది సబ్బం హారి ఎన్నికల కోడ్ ఉల్లంఘన‌కు పాల్పడినట్లు వచ్చిన పిర్యాదు పై కలెక్టర్ విచారణ కు ఆదేశించడం రాజకీయ దూమారన్ని రేపుతుంది.

భీమిలి నియెజకవర్గ టీడిపి అభ్యర్ధి సబ్బం హరి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం ఉద్యోగులను ప్రలోభపరచరాన్నఅరోపణలు వినిపిస్తున్నాయి. ఒకేసారి 500మంది ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి ప్రలోభాల వల విసిరారంటూ ఆరోపనులు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించిన ఆడియో కూడా వైరెల్ అవుతోంది.

స్థానిక అధికారుల సహకారంతో ఈ వ్యవహారం నడిపినట్లు ఆరోపణలు రావడంతో వ్యవహారం కాస్తా ఈసీ దాకా వెళ్లింది. దీంతో జిల్లా కలెక్టర్ భాస్కర్ ఈ వ్యవహారం పై విరాచణ కు ఆదేశించినట్లు తెలుస్తోంది ఈ అంశం పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ విచారణకు ఆదేశించారు. డీఆర్వోను విచారణాధికారిగా నియమించారు. సబ్బం హరి మాట్లాడిన ఆడియో టేపులను పరిశీలించిన తర్వాత అది కచ్చితంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనే అని భావించి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. ఈలోగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.

దీంతో ఒక్కసారిగా విశాఖ లో రాజకీయ ప్రకంపనలు మోదలయ్యాయి. ఈ వ్యవహారం పై ఈసి ఏలాంటి నిర్ణయం తీసుకోనుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే సబ్బం హారి నుండి మాత్రం ఈ వ్యవహారం పై స్పందన రావడం లేదు. కేవలం కార్యకర్తల మీటింగు లో మాట్లాడిన అంశాలను ప్రతిపక్షాలు కావాలనే రచ్చ చేస్తూ రాజకీయ కుట్రలు చేస్తున్నారని హారి వర్గీయుల ద్వారా సమాచారం పంపుతున్నారు. మరి ఈ ఆడియె టేపుల వ్యవహారం ఎలాంటి ప్రకంపనలు స్రుష్టిస్తుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories