ముంబై నార్త్ సెంట్రల్ లో గెలుపెవరిది...పూనమ్ మహాజన్ వర్సెస్ ప్రియాదత్

ముంబై నార్త్ సెంట్రల్ లో గెలుపెవరిది...పూనమ్ మహాజన్ వర్సెస్ ప్రియాదత్
x
Highlights

వాళ్లిద్దరూ ఇద్దరు ప్రముఖ నేతల బిడ్డలు ఇద్దరికీ మంచి పేరుంది. ప్రజాసేవ చేయాలన్న తపన ఉంది మహిళా శక్తులుగా ఎదుగుతున్న ఇద్దరూ ఒకే నియోజక వర్గం నుంచి...

వాళ్లిద్దరూ ఇద్దరు ప్రముఖ నేతల బిడ్డలు ఇద్దరికీ మంచి పేరుంది. ప్రజాసేవ చేయాలన్న తపన ఉంది మహిళా శక్తులుగా ఎదుగుతున్న ఇద్దరూ ఒకే నియోజక వర్గం నుంచి బరిలోకి దిగడం ఆసక్తిని రేపుతోంది. ముంబై నార్త్ సెంట్రల్నుంచి పోటీ పడుతున్న ఆ ఇద్దరు మహిళలెవరు? వారి వివరాలేంటి?

ముంబై నార్త్ సెంట్రల్ నియోజక వర్గం ఇద్దరు మహిళల పోటీతో కళకళలాడనుంది. ఇద్దరూ పేరున్న పెద్ద నేతల కుమార్తెలే ఇద్దరికీ ప్రజాసేవపై మంచి పట్టు, ఆసక్తి రెండూ ఉన్నాయి వీరిద్దరూ హేమా హేమీలే కావడంతో గెలుపెవరిదన్నది ఉత్కంఠగా మారింది.

పూనమ్ మహాజన్ ముంబై ప్రజలకు చిరపరిచితమైన పేరిది. బీజేపీలో చాలా కీలకమైన నేత అయిన తండ్రి ప్రమోద్ మహాజన్, కొన్నేళ్ళ క్రితం అనుమానాస్పద మరణం పాలవడం అప్పట్లో సంచలనం రేపింది. ప్రమోద్ మహాజన్ కి బీజేపీ లో హైటెక్ నేతగా పేరు. మన దేశంలో లాప్ టాప్ లు వాడుకలో లేని సమయంలోనే ఆయన లాప్ టాప్ మెయిన్ టెయిన్ చేసేవారు సాంకేతిక నైపుణ్యం పట్ల ఆసక్తి ఉన్నవాడు కావడంతో ప్రమోద్ ను పార్టీలో అందరూ గౌరవించే వారు ఆయన కుమార్తెగా పూనమ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీ యువమోర్ఛా ప్రెసిడెంట్ గా ఆమెకు మంచి పేరే ఉంది 2005 నుంచి ఈ నియోజక వర్గంలో ప్రియాదత్ వరసగా గెలుస్తూ వస్తున్నారు గత ఎన్నికల్లో పూనమ్ ప్రియాదత్ ను ఓడించి సంచలనం సృష‌్టించారు. దాదాపు రెండు లక్షల మెజారిటీతో పూనమ్ ప్రియాదత్ పై విజయం సాధించారు.

నియోజక వర్గానికి తాను చేసిన సేవలే తనను గెలిపిస్తాయంటున్నారు పూనమ్ మహాజన్. ప్రధానిగా మోడీని ఎన్నుకుంటేనే దేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుందని ప్రచారం చేస్తున్న పూనమ్ ఈ పాటికే ఓటర్లను కలుస్తూ తిరుగుతున్నారు. ఇక ప్రియాదత్ వాస్తవానికి ఎన్నికలకు దూరంగా ఉండాలని భావించారు. కానీ రాహుల్ గాంధీ ఒత్తిడి చేయడంతో ఆమె అయిష్టంగానే ఈ సారి ఎన్నికల్లో దిగుతున్నారు.

అభ్యర్ధులిద్దరికీ వారి తండ్రులు సాధించిన ఘన కీర్తే పెట్టుబడి. ప్రమోద్ మహాజన్ బీజేపీ కోర్ టీమ్ లో పెద్ద నేత కాగా, ప్రియాదత్ తండ్రి సునీల్ దత్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్రంలో క్రీడల శాఖను నిర్వహించారు. శాంతి కాముకుడిగా ఆయనకు పేరు.

ఇక నియోజక వర్గం విషయానికొస్తే ముంబై నార్త్ సెంట్రల్ సినీస్టార్లు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఎక్కువ మంది సెలబ్రిటీలు కొలువై ఉన్న ప్రాంతం అందరూ విద్యావంతులే కాబట్టి ఓటర్లను ఆకట్టుకోడం ఇక్కడ చాలా కష్టమైన పని

సునీల్ దత్ మరణం తర్వాత 2005లో రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాదత్ శివసేన అభ్యర్ధిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా కూడా నియమితులయ్యారు. కేంద్రంలో పెద్ద పదవులేవీ చేపట్టనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి గెలుపు నందించే నమ్మకమైన అభ్యర్ధిగా ఆమె మిగిలిపోయారు. కేవలం గత ఎన్నికల్లో మోడీ వేవ్ కారణంగా మాత్రమే ఆమె ఓటమి పాలయ్యారు. ఈసారి రాహుల్ ఒత్తిడితో బరిలోకి దిగుతున్న ప్రియాదత్ గెలుపు అవకాశాలెలా ఉన్నాయో చూడాలి.

మరోవైపు తొలిసారి ఎంపీ అయిన పూనమ్ మహాజన్ భారతీయ జనతా పార్టీ యువ మోర్ఛా ప్రెసిడెంట్ మామయ్య గోపీనాథ్ ముండే, తండ్రి ప్రమోద్ మహాజన్ ల నేపధ్యం కారణంగా పూనమ్ రాజకీయ అరంగేట్రం కేక్ వాక్ లా సాగిపోయింది. పార్లమెంటులో అప్పుడప్పుడు తప్పితే ఆమె గళం పెద్దగా వినిపించలేదు మరి ఈ సారి గెలిస్తే పూనమ్ ఎలాంటి పనులు చేస్తారో చూడాలి. ఇద్దరూ బలమైన నేపధ్యం కలిగిన వారు కావడం, వ్యక్తిగతంగా మంచి పేరు , గుర్తింపు కలిగిన వారు కావడంతో ఈసారి ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలన్నది తేల్చుకోవడం ముంబై నార్త్ సెంట్రల్ ఓటర్లకు కాస్త కష్టమే.

Show Full Article
Print Article
Next Story
More Stories