logo

పార్టీ వీడితే.. క్రిమినల్‌ కేసు పెట్టండి

పార్టీ వీడితే..  క్రిమినల్‌ కేసు పెట్టండి
Highlights

కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ టీఆర్ఎల్ లో చేరతారని గత కొద్ది రోజులుగా...

కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ టీఆర్ఎల్ లో చేరతారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారంపై స్పందించిన పొన్నం పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుబోతున్నానని అనడం సబబు కాదని, ఏ పరిస్థితుల్లోనూ పార్టీ మారనని అఫిడవిట్‌ ఇస్తున్నానని ప్రకటించారు. ఒకవేళ పార్టీ వీడితే తనపై చట్టరీత్యా చర్యలు తీసుకునే హక్కును ప్రజలకు కల్పిస్తున్నానని చెప్పారు. ఈ విషయంలో తనపై చీటింగ్‌, క్రిమినల్‌ కేసు కూడా పెట్టవచ్చని, ఈ అఫిడవిట్‌ ప్రతులను లోక్‌సత్తా, అనేక స్వచ్ఛంద సంస్థలకు, ప్రజా సంఘాలకు పంపిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాను ఏడు ముక్కలు చేశారని, కరీంనగర్‌కు మెడికల్‌కాలేజ్‌ ప్రకటించి ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుని మోసం చేశారని విమర్శించారు.


లైవ్ టీవి


Share it
Top