సార్వత్రిక వేళ టీ కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌లు...మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారితే?

సార్వత్రిక వేళ టీ కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌లు...మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారితే?
x
Highlights

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రేపు తెలంగాణలో పర్యటిస్తున్న వేళ ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న పొంగులేటి సుధాకర్...

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రేపు తెలంగాణలో పర్యటిస్తున్న వేళ ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను అధినేత రాహుల్ గాంధీకి స్వయంగా పంపిన ఆయన కాసేపట్లో బీజేపీలో చేరనున్నారు. అధిష్టాన విధేయుడిగా గుర్తింపు పొందిన పొంగులేటి సుధాకర్ రెడ్డి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.

తెలంగాణ ఇచ్చాం తెలంగాణ తెచ్చాం అంటూ 2014లో ఎన్నికలకు వెళ్లిన టీ కాంగ్రెస్‌కు కష్టాలు తప్పడం లేదు. అటు పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఇటు సీనియర్ నేతలు పక్క చూపులు చూస్తూ ఉండటంతో పార్టీకి రోజుకో షాక్ తగులుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం అటు అధిష్టానం ఇటు కేడర్‌లో ఆందోళన కలుగుతోంది.

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటి వరకు 10 మంది పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఇందులో సీనియర్ నేతలుగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డితో పాటు తొలిసారి పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. టీఆర్ఎస్‌లో అధికారికంగా చేరకపోయినా పార్టీని వీడుతున్నట్టు స్పష్టంగా ప్రకటించారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారితే కాంగ్రెస్ శాసనసభా పక్షం టీఆర్ఎస్‌లో విలీనమయ్యే అవకాశాలున్నాయి.

ఇలాంటి సమయంలో పార్టీలో అత్యున్నత స్ధానంలో ఉండి కీలక నేతలుగా ఉన్న పలువురు నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. మాజీమంత్రి, సీనియర్ నేత డీకే అరుణ పార్టీని వీడి బీజేపీలో చేరారు. మహబూబ్ నగర్ నుంచి బీజేపీ తరపున ఆమె పోటీకి దిగారు. అయితే బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా కాంగ్రెస్ సీనియర్ నేతలను ఆకర్షిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ స్ధానాన్ని బీజేపీ చేరుకునేలా సీనియర్లను చేర్చుకుంటున్నట్టు విశ్లేషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories