ఉత్తరాంధ్రలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

ఉత్తరాంధ్రలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
x
Highlights

ప్రశాంతతకు మారుపేరైన ఉత్తరాంధ్రలో పోలింగ్‌ విజయవంతంగా ముగిసింది. ఉదయం మందకోడిగా ప్రారంభమైన పోలీంగ్‌ మధ్యాహ్నం వరకు ఊపందుకుంది. కొన్నిచోట్ల రికార్డు...

ప్రశాంతతకు మారుపేరైన ఉత్తరాంధ్రలో పోలింగ్‌ విజయవంతంగా ముగిసింది. ఉదయం మందకోడిగా ప్రారంభమైన పోలీంగ్‌ మధ్యాహ్నం వరకు ఊపందుకుంది. కొన్నిచోట్ల రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదయ్యింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటింగ్‌ ప్రశాంతంగా జరిపేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.

సార్వత్రిక ఎన్నికల్లో సిక్కోలు జిల్లా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం జిల్లాలో చాలా చోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లు మొరాయించడంతో కొన్నిచోట్ల ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. అయితే వెంటనే సాంకేతిక నిపుణులు సమస్యను పరిష్కరించడంతో సర్దుమణిగింది. ఇటు సమస్యాత్మక కేంద్రాలతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్స్‌ను పెట్టి నిఘాను పటిష్టం చేశామని జిల్లా ఎన్నికల అధికారి జే నివాస్‌ తెలిపారు. గతంలో రికార్డు స్థాయిలో నమోదైన పోలింగ్‌ పర్సెంటేజీని ఈసారి మరింత పెంచేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశామన్నారు.

విజయనగరం జిల్లాలో ఉదయం మందకోడిగా ప్రారంభం అయిన పోలింగ్‌ మధ్యాహ్నం తర్వాతే ఊపందుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటేసేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినా ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా జరిగాయి. వృద్ధులు, వికలాంగులు ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో పోలింగ్‌ చాలా మందకోడిగా కొనసాగింది. ఈవీఎంలు మొరాయించిన చోట్లలో గంట ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. ముఖ్యంగా యువ ఓటర్లు మొదటిసారి ఓటేసేందుకు ఉత్సాహం చూపించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఓటర్లు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories