రెండు తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్‌ శాతమిదే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్‌ శాతమిదే!
x
Highlights

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ప్రజలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాడాని పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ప్రజలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాడాని పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. అయితే మధ్యహ్నం ఒంటి గంట వరకు ఏపీలో 48శాతం, తెలంగాణలో 38.08 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఏపీలో పలు చోట్ల ఈవీఎంలు ఓటర్లకు చుక్కలు చూపించాయి. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈవీఎంలు మెరాయించడంతో ఓటర్లు అసహనానికి గురయ్యారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల సమస్య తలెత్తడంతో అధికారులు, ఓటర్లను తీవ్ర ఇబ్బందిపడ్డారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ సాంకేతిక లోపాల కారణంగా ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు గంటలకొద్ది క్యూ లైన్ లోనే నిలబడాల్సి వచ్చింది.

మరోవైపు తెలంగాణలోని లోక్‌సభ స్థానాల్లో నమోదైన పోలింగ్ శాతం వివరాలు. హైదరాబాద్‌ 20.59 శాతం, సికింద్రాబాద్‌లో 23.85, మల్కాజ్‌గిరిలో 27.07, ఆదిలాబాద్‌లో 45.06, నిజామాబాద్‌లో 38.10, చేవెళ్ల 29.03, మెదక్‌లో 54, జహీరాబాద్‌లో 52.45, మహబూబ్‌నగర్‌లో 44, నాగర్‌కర్నూల్‌లో 45.82, కరీంనగర్‌లో 45.62, పెద్దపల్లిలో 47.50, నల్గొండ 42.09, భువనగిరి 40.99, వరంగల్‌ 40.24, మహబూబాబాద్‌ 47.29, ఖమ్మం 41.65శాతం పోలింగ్‌ నమోదైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories