సుందరానికి తొందరెక్కువైందా...అందుకేనా ముందస్తు సర్వేలు?

సుందరానికి తొందరెక్కువైందా...అందుకేనా ముందస్తు సర్వేలు?
x
Highlights

హోరాహోరీగా సార్వత్రిక పోలింగ్ ముగిసి రోజులు గడుస్తున్నా అభ్యర్దుల్లో ఉత్కంఠ మాత్రం రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. టెన్షన్ పెరుగుతోంది. బీపీ రైజ్‌...

హోరాహోరీగా సార్వత్రిక పోలింగ్ ముగిసి రోజులు గడుస్తున్నా అభ్యర్దుల్లో ఉత్కంఠ మాత్రం రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. టెన్షన్ పెరుగుతోంది. బీపీ రైజ్‌ అవుతోంది. ఫలితాలు మే 23వ తేది తేలాల్సిందే అయినా అందాకా ఆగలేమంటున్నారు ప్రధాన పార్టీల అభ్యర్దులు. గెలుపు లెక్కల కోసం ఏకంగా సొంత సర్వేలు మొదలెట్టారు. వారివారి నియోజకవర్గాల పరిధిలో ప్రాంతాలు, సామాజికవర్గాలు, డివిజన్లు ఇలా విభజించి మరీ తమకు ఓటు నొక్కారా లేదా అని తెలుసుకునే పనిలో పడ్డారు. అంతేకాదు ఫోన్ కాల్స్ చేసి మరీ మీరు ఎవరికి ఓటు వేసారంటూ ఆరాతీస్తున్నారు. సుందరానికి తొందరెక్కువ అన్నట్లుగా మారింది అభ్యర్దుల పరిస్దితి. ఇంతకీ సర్వేలు జరిగింది ఎక్కడెక్కడా సర్వేలు చేసిందెవరు.

మీ నెంబర్‌కు ఓ ఫోన్ కాల్ వస్తుంది. బహుశా ఇప్పటికే ఆ ఫోన్ కాల్ వచ్చే ఉండాలి. అదేనండీ ఓ రికార్డెడ్ కాల్, అపరిచిత నెంబర్ నుంచి వస్తుంది. మీరు ఫోన్ ఎత్తగానే మీరు మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్ది గెలుపొందుతాడని అనుకుంటున్నారు లేదా మీరు ఎవరికి ఓటువేసారు టీడీపీ అయితే 1నొక్కండి, వైసీపీ ఐతే 2నొక్కండి, జనసేన అయితే 3 నొక్కండి. మరే ఇతర పార్టీల అభ్యర్దులైతే 4నొక్కండి అంటూ ఇలా ఓ మహిళ గొంతు వినిపిస్తుంది. మీరు ఎవరికి అనుకూలంగా నెంబర్ నొక్కుతారో మీరు వారికి ఓటు వేసినట్లుగా రికార్డ్ అవుతుంది. ఇలా ఎంత మంది ఏయే పార్టీకి ఓటు వేసారో ఈ ఫోన్ కాల్ ద్వారా తెసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్దులు. హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరంలో, ఫలితాలకు నెలరోజుల టైం ఉండటంతో, అంతవరకూ ఉత్కంఠ తట్టుకోలేక సర్వేల బాట పట్టారు అభ్యర్థులు.

ఏవో కొన్ని నియోజకవర్గాలే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి. జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుందనుకుంటున్నారు అంటూ మరో కాల్ వస్తుంది. ఆ తరువాత ఏపిలో ఎవరు సీఎం కాబోతున్నారని అనుకుంటున్నారు మీ ఓటు ఎవరికి వేశారంటూ ఆప్షన్లు చెబుతూ నెంబర్లు ఎంచుకోమంటూ ఫోన్ కాల్‌ చేస్తున్నారు. ఇలా ప్రతిఒక్కరికీ మూడు ఫోన్ కాల్స్ కచ్చితంగా వచ్చే ఉండాలి. ఇలా కాల్స్ వచ్చాయంటూ ఎంతో మంది ఓటర్లు చెబుతుంటే గోప్యంగా ఉండాల్సిన ఓటు హక్కును సర్వేల పేరుతో బహిర్గతం చేస్తున్నారంటూ విమర్మలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సర్వేలపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టిసారించాలని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఓటర్లను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు సామాజికవేత్తలు.

పశ్చిమగోదావరి జిల్లాలో ఇలా ఫోన్ కాల్ ద్వారా ఓటు గుట్టును రాబట్టడం ఒకెత్తయితే, ఏకంగా ఓటరు ఇంటికే వెళ్లి ఇంట్లోని ప్రతీ ఒక్కరినీ ఆరా తీయండం ఈ సర్వేలో మరో పద్దతి. ఇంటింటికీ వెళ్లి మరీ అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇలా ఇప్పటికే జిల్లాలోని 15నియోజకవర్గాల పరిధిలో పట్టణాలు, గ్రామాల్లోని అభ్యర్దుల అనుచరుల ద్వారా మహిళలను రంగంలోకి దించుతున్నారు. సర్వే నిర్వహిస్తున్నట్లుగా ఏమాత్రం అనుమానం రాకుండా ఆయా ఏరియాల్లో ఎంతమంది తమ పార్టీకి ఓటు వేసారనేది క్షేత్రస్దాయికి వెళ్లి మరీ, లెక్కలు కట్టేస్తున్నారు. ఇప్పటికే గెలుపు, ఓటములపై అభ్యర్దులు ఓ అంచనాకు వచ్చేస్తున్నారు. ఏలూరు వంటి కార్పోరేషన్ల పరిధిలోని తమతమ పార్టీల కార్పొరేటర్లకు సన్నిహితంగా ఉన్న కొందరిని బృందాలుగా పంపుతూ ఓటు గుట్టును రాబడుతున్నారు.

అట్టహాసంగా ప్రచారాలు, హామీలు, తాయిలాలు, ఇలా ఇంతలా ఓటర్ చుట్టూ ప్రదక్షిణలు చేసిన అభ్యర్దులుకు గెలుపు, ఓటములపై టెన్షన్ ఉంటే ఉండొచ్చు. తాము నెగ్గుతామా ఓడుతామా అనే వరకైతే ఇలాంటి సర్వేల వల్ల పెద్దగా ప్రభావం ఉండదు. అంతేగానీ ఓటు ఎవరికి వేసారో తెలుసుకుని వారిపై కక్షగట్టి దాడులకు దిగే పరిస్దితి వస్తే ఇదే ప్రజాస్వామ్యవాదులను వెంటాడుతున్న ప్రశ్న ఇలా ఫలితాల వరకూ ఆగలేక ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సర్వేల దాడి సరైనది కాదంటూ అభ్యర్దుల తీరుపై విమర్మలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుంచి పోలింగ్ రోజు వరకూ మీ ఓటు నాకే వేయండి అంటూ చెవులు పగిలేలా తెగ ఊదరగొట్టే రాజకీయ పార్టీల అభ్యర్దులు కనీసం పోలింగ్ ముగిసిన తర్వాతైనా ఫలితాల కోసం ఆగొచ్చుకదా తెలుసుకుంటే లెక్కలు మారిపాతాయా ఏంటీ అంటూ సర్వేల హంగామాపై జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories