మసూద్ అజార్ పై యాక్షన్ లో రాజకీయముందా?

మసూద్ అజార్ పై యాక్షన్ లో రాజకీయముందా?
x
Highlights

కరడు గట్టిన ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్ కూడా సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారిపోయాడు మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా డిక్లేర్ చేసిన...

కరడు గట్టిన ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్ కూడా సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారిపోయాడు మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా డిక్లేర్ చేసిన క్రెడిట్ బీజేపీకే దక్కుతుందంటున్నారు కమలనాథులు అజార్ ను దూరం పెట్టడంలో చైనాతో తమ ప్రభుత్వం జరిపిన దౌత్యం ఫలించిందని బీజేపీ చెప్పుకుంటోంది. మోడీ అధికారంలోకి వస్తేనే దేశ భద్రత ఉంటుందని ఎన్నికల ర్యాలీలలో బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు.

మరోవైపు ఇదే బీజేపీ గతంలో ఆయన్ను జైలు నుంచి విడిపించి సురక్షితంగా అప్పగించిన విషయం ప్రజలింకా మరిచిపోలేదంటున్నారు మాయావతి. కల్లబొల్లి మాటలతో ఎన్నికల ముందు జిమ్మిక్కులు చేయడం బీజేపీ మానుకోవాలని మాయావతి హెచ్చరించారు. బీజేపీకి ప్రచారార్భాటం ఎక్కువవుతోందని విమర్శించింది కాంగ్రెస్ తమ హయాంలో ఆరు సర్టికల్ స్ట్రైక్స్ జరిగినా వాటిని బయటకు చెప్పలేదని కానీ బీజేపీ ఇప్పుడు ఎన్నికల కోసం ఇష్టాను సారం ప్రచారం చేసుకుంటోందని తిట్టి పోసింది. మసూద్ అజార్ పై పాకిస్థాన్ తో గొడవ పడింది తామేనని కాంగ్రెస్ చెప్పుకుంది. అజార్ ను ఉగ్రవాదిగా ప్రకటించి గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ గతంలో ఆయన్ను గిఫ్ట్ ప్యాక్ గా తాలిబ్లనకు అప్పగించిన విషయం జాతి మర్చిపోలేదని విమర్శించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories