Top
logo

జాతీయ నేతల సంఘీభావం

జాతీయ నేతల సంఘీభావం
Highlights

ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు పలు పార్టీల నేతలు తరలి వస్తున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్...

ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు పలు పార్టీల నేతలు తరలి వస్తున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దీక్షా స్థలికి వచ్చి మద్దతు తెలిపారు. అలాగే సమాజ్ వాదీ పార్టీ గౌరవ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా, లోక్ తాంత్రిక్ జనతా దళ్ అధినేత శరద్ యాదవ్‌తో పాటు పలు పార్టీల ఎంపీలు చంద్రబాబును కలసి దీక్షకు సంఘీభావం ప్రకటించారు.

మరోవైపు 12 గంటల దీక్ష చేస్తున్న చంద్రబాబుతో తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోన్లో మాట్లాడారు. ఏపీ సీఎం చేస్తున్న ఆందోళనకు మమత మద్దతు ప్రకటించారు. ఇక తృణమూల్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ దీక్ష చేస్తున్న చంద్రబాబును కలిసి ఏపీ ప్రజల పోరాటానికి అండగా ఉంటామన్నారు.


లైవ్ టీవి


Share it
Top