Union Budget 2020-21పై ఎవరెవరు ఎం ఎం అన్నారంటే ?

Union Budget 2020-21పై ఎవరెవరు ఎం ఎం అన్నారంటే ?
x
Highlights

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మోడీ సర్కారు రెండోసారి...

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మోడీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ రెండోసారి బడ్జెట్‌ పాఠం చదివి వినిపించారు. లోక్‌సభలో రెండున్నర గంటలకుపైగా బడ్జెట్‌ ప్రసంగం చేసిన నిర్మల.. గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్ద పీట వేశారు. ఆదాయపన్ను చెల్లింపులో పలు మార్పులు తీసుకొచ్చారు. మధ్య, ఎగువతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లలో మార్పులు చేశారు. అయితే సుదీర్ఘంగా బడ్జెట్‌ ప్రసంగం కొనసాగింపు వల్ల షుగర్‌ లెవల్స్‌ తగ్గడంతో రెండు పేజీలు చదవకుండానే తన ప్రసంగాన్ని ముగించారు. .

అయితే ఈ బడ్జెట్ పై రెండు తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ ప్రముఖులు ఎం అన్నారో చూద్దాం..

విజయసాయి రెడ్డి :

కేంద్ర బడ్జెట్‌ తమకు నిరాశ కలిగించిందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. వ్యవసాయంపై ఆధారపడి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బడ్జెట్‌ నిరుపయోగమని ఆయన పెదవి విరిచారు. బడ్జెట్‌ ప్రసంగం అనంతరం ఆయన పార్లమెంట్‌ ఆవరణలో వైసీపీ ఎంపీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదన్న విజయసాయి రెడ్డి, డిపాజిటర్ల బీమ లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం మంచి పరిణామం అని తెలిపారు.

పవన్ కళ్యాణ్ :

రాష్ట్రానికి బడ్జెట్‌ కేటాయింపులు తీసుకురావడంలో జగన్ సర్కారు విఫలమైనట్లు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని తరలింపు, నిర్మాణాల కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ.. బడ్జెట్ కేటాయింపులపై పెట్టలేదని విమర్శించారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు.

కేటీఆర్ :

కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరాశజనకంగా ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. బడ్జెట్ లో విధించిన కోతలు తెలంగాణ పై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వరకు నీతి ఆయోగ్ సిఫార్సులను సైతం కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. బడ్జెట్ పై తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేస్తూ కేటీఆర్ ట్విట్ చేశారు.

నామా నాగేశ్వర రావు :

బడ్జెట్ లో తెలంగాణకు న్యాయం జరగలేదని టీఆర్ ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు విమర్శించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. బడ్జెట్ లో విభజన అంశాలు, ట్రైబల్ మ్యూజియం ప్రస్తావనే లేదని పెదవి విరిచారు. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేలా బడ్జెట్ లేదని నామా నాగేశ్వర రావు అభిప్రాయపడ్డారు.

బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి :

కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశపర్చిందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విభజన అంశాలపై కనీసం దృష్టి కూడా పెట్టలేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు, వెనబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన గ్రాంట్‌ ను కూడా విస్మరించారని.. చెప్పారు.

బీజేపీ లక్ష్మణ్ :

కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా ఉందన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. గ్రామీణ రంగానికి, యువత నైపుణ‌్య శిక్షణ కోసం బడ్జెట్ లో పెద్దపీట వేశారని తెలిపారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించారని లక్ష్మణ్ వెల్లడించారు.

రామకృష్ణ :

కేంద్ర బడ్జెట్‌ను విజయవాడ సీఐఐ ప్రతినిధులు స్వాగతించారు. ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే బడ్జెట్‌గా ఉందని సీఐఐ ప్రతినిధి రామకృష్ణ అన్నారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ రంగంలో ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశముందని రామక్రిష్ణ అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories