logo

నిజామాబాద్‌ పోలింగ్‌ వాయిదా పడుతుందా..?

నిజామాబాద్‌ పోలింగ్‌ వాయిదా పడుతుందా..?
Highlights

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎలక్షన్స్ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారాయి. నామినేషన్ల పరిశీలన ముగిసిన...

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎలక్షన్స్ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారాయి. నామినేషన్ల పరిశీలన ముగిసిన తర్వాత కూడా ఇక్కడ భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక రసవత్తరంగా మారింది. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు వాయిదా పడతాయా..? ఒకవేళ సకాలంలో జరిగినా ఈవీఎంనా బ్యాలెట్ ఎన్నికలా..? ఇలా నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాలకు గానూ 505 మంది నామినేషన్లు చెల్లగా, ఒక్క నిజామాబాద్ లోక్ సభ స్థానంలోనే రికార్డు స్థాయిలో 191 నామినేషన్లు ఓకే అయ్యాయి. రేపటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. ఉపసంహరణకు గడువు ముగిసిన తర్వాత కూడా అంతే మంది అభ్యర్థులు పోటీలో ఉంటే రిటర్నింగ్‌ అధికారి వాస్తవ పరిస్థితిని ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తారు. దీంతో ఎన్నికల సంఘం గుర్తించిన ప్రింటర్లతో అధికారులు సమావేశం కానున్నారు. వారు నిర్ణీత గడువులోగా బ్యాలెట్‌ పేపర్లు ముద్రించగలమని హామీ ఇస్తే యథావిధిగా ఏప్రిల్‌ 11నే పోలింగ్‌ జరుగుతుంది. లేదంటే వాయిదా పడే అవకాశం ఉంది.

పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు నిజామాబాద్‌లో రైతులు వినూత్న పంథాను ఎంచుకున్నారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు రైతులు వినూత్న పంథాను ఎంచుకున్నారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. మొత్తం 203 మంది 245 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 12 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దీంతో ప్రస్తుతానికి బరిలో 191 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో 186 మంది రైతులు పోటీలో ఉన్నారు. వీరంతా నామినేషన్లను విత్‌డ్రా చేసుకోకపోతే, ఇక్కడ బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు తప్పకపోవచ్చు.

గతంలో ఉమ్మడి ఏపీలోని నల్గొండ లోక్ సభ స్థానానికి ఎన్నిక విషయంలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితి నెలకొంది. 1996లో నల్లగొండ లోక్ సభ స్థానం నుంచి 642 మంది నామినేషన్లు వేసి ఫ్లోరోసిస్ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లారు. అప్పట్లో అతిపెద్ద బ్యాలెట్ పేపర్ ముద్రించడానికి సమయం కావాల్సి ఉండటంతో ఎన్నికను వాయిదా వేసి మళ్లీ నిర్వహించారు. తాజాగా లోక్ సభకు జరుగుతున్న ఎన్నికల్లోనూ నిజామాబాద్ నుంచి రైతులు భారీగా నామినేషన్లు వేయడంతో ఇక్కడ ఎన్నికలను ఎలా నిర్వహించనున్నారనే దానిపై చర్చ జరుగుతోంది.

రైతులు నామినేషన్లు వేయడం వెనుక విపక్షాలు ఉన్నాయని అధికారపక్షం నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రైతులను బుజ్జగించేందుకు ఒకసారి ప్రయత్నించినా సఫలం కాలేదు. కాబట్టి మరోసారి రైతులతో చర్చలు జరిపే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉప సంహరణ గడువు మగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లతో జాబితాను ప్రకటించి, గుర్తులు కేటాయిస్తారు.



లైవ్ టీవి


Share it
Top