Top
logo

వనస్థలిపురం దోపిడీ గ్యాంగ్‌ను గుర్తించిన పోలీసులు

వనస్థలిపురం దోపిడీ గ్యాంగ్‌ను గుర్తించిన పోలీసులు
Highlights

భాగ్యనగరంలో సెన్షేషన్‌ క్రియేట్‌ చేసిన చోరీ కేసులో పోలీసులు పురోగతిసాధించారు. వనస్థలిపురంలో పట్టపగలు 58 లక్షల...

భాగ్యనగరంలో సెన్షేషన్‌ క్రియేట్‌ చేసిన చోరీ కేసులో పోలీసులు పురోగతిసాధించారు. వనస్థలిపురంలో పట్టపగలు 58 లక్షల దోచుకెళ్లింది రాంజీముఠాగా గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఈ ముఠా చోరీకి పాల్పడినట్లు రాచకొండ పోలీసులు నిర్థారించారు. దోపిడీ తర్వాత చెన్నై వెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు. ఏటీఎం నగదు చోరీ కేసును ఛేదించేందుకు ఐదు పోలీసు బృందాలు రంగంలోకి దిగారు. చోరీకి పాల్పడిన వారి కోసంపై సీసీ ఫూటేజీ ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు. దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోందని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని.. పోలీసులు చెబుతున్నారు.

Next Story