నేడు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు...తాగి వాహనం నడిపితే కటకటాలే..

New Year Celebrations
x
New Year Celebrations
Highlights

న్యూ ఇయర్ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబైంది. కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్‌కం పలికేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధమయ్యారు. అయితే ముందస్తు జాగ్రత్తగా ఇవాళ రాత్రి జరిగే న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.

న్యూ ఇయర్ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబైంది. కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్‌కం పలికేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధమయ్యారు. అయితే ముందస్తు జాగ్రత్తగా ఇవాళ రాత్రి జరిగే న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. హోటల్స్, పబ్స్, రిసార్ట్స్, పామ్ హౌస్‌ల‌లో పార్టీలకు రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. హోటల్స్, పబ్బుల్లో మహిళల కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని సూచించారు. న్యూ ఇయర్ ఈవెంట్స్‌ను సీసీ కెమెరాతో రికార్డు చేయాలని ఆదేశించిన పోలీసులు లైసెన్స్డ్ ఆయుధాలను వెంట తీసుకొచే వారిని పార్టీల్లోకి అనుమతించొద్దని నిర్వాహకులకు హెచ్చరించారు. అలాగే పార్టీలలో బాణసంచా కాల్చడాన్ని కూడా నిషేధించారు పోలీసులు.

మరోవైపు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ట్రాఫిక్‌ పోలీసులు నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. బేగంపేట ఫ్లైఓవర్ మినహా అన్ని ఫ్లైఓవర్లపై నేటి రాత్రి రాకపోకలను నిషేధించనున్నామని ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఆంక్షలు ఇవాళ రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి రెండుగంటల వరకూ అమల్లో ఉంటాయని తెలిపారు. తాగి వాహనం నడిపితే కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్‌, పోలీసుశాఖలు హెచ్చరికలు జారీ చేశాయి.

ఇక రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు విస్తృతంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించనున్నారు. ట్రాఫిక్‌, పోలీసు సిబ్బంది మొత్తం విధుల్లో ఉండి నిరంతర గస్తీతో పాటు బ్రీత్‌ అనలైజర్‌ ద్వారా వాహన చోదకులకు పరీక్షలు చేయనున్నారు. వాహనదారులను హెచ్చరిస్తూ ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. మద్యం సేవించి వాహనం నడిపేవారిపై మోటారు వాహన చట్టం సెక్షన్‌ 185 ప్రకారం కేసు నమోదు చేస్తామని, మోతాదుకు మించి మద్యం తాగినట్లు రుజువైతే న్యాయస్థానం ఆరు నెలల జైలుశిక్ష విధించే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

కొత్త ఏడాది సంబరాల్లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు ఎక్కువగా రాష్ట్ర రాజధానిలోనే నమోదవుతున్నాయి. గతేడాది డిసెంబర్‌ 31న హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 2,499 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. మొత్తం 1,309 ద్విచక్ర వాహనాలు, 276 కార్లు, 86 ఆటోరిక్షాలను అధికారులు జప్తు చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories