జయరాం హత్య కేసు.. పోలీసుల మెడకు ఉచ్చు!

జయరాం హత్య కేసు.. పోలీసుల మెడకు ఉచ్చు!
x
Highlights

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. నిందితుడు రాకేష్‌రెడ్డికి సలహాలిచ్చిన పోలీసుల పాత్రపై దర్యాప్తు మొదలైంది....

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. నిందితుడు రాకేష్‌రెడ్డికి సలహాలిచ్చిన పోలీసుల పాత్రపై దర్యాప్తు మొదలైంది. నల్లకుంట సీఐ, ఇబ్రహీంపట్నం ఏసీపీలను విచారణకు హాజరుకావాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. తాజాగా రాయదుర్గం సీఐపై కూడా వేటుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే వేటు వేశామని పోలీసులు చెబుతుంటే రాకేష్‌తో ఫోన్‌కాల్ కారణంగానే రాయదుర్గం సీఐని అటాచ్ చేశారని తెలుస్తోంది. మరోవైపు రాకేష్‌రెడ్డికి చాలా మంది రియల్టర్లతో సంబంధాలుండటంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ముగ్గురు రియల్టర్లను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. హత్య జరిగిన సమయంలో రాకేష్ ఇంట్లో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే, జయరాంపై రాకేష్‌రెడ్డి దాడి చేసిన అనంతరం విశాల్ దిండుతో అదిమి ఆయన ప్రాణం తీసినట్టు తెలుస్తోంది దీంతో పోలీసులు ఇప్పటికే చింతల్ రైడీషీటర్ నగేష్, మేనల్లుడు విశాల్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చే సమాచారంతో మరికొంత మందిని అదుపులోకి తీసుకోనున్నారు. హనీ ట్రాప్ ద్వారానే జయరాంను ట్రాప్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. హనీ ట్రాప్ చేసిన సూర్యప్రసాద్ అలియాస్ డుంబును పోలీసులు రెండు రోజులపాటు విచారించారు. మరో 8రోజుల కస్టడీతో మరిన్ని విషయాలు వెలుగుచూడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories