మహిళా మావోయిస్టు మంగ్లీ అరెస్ట్‌..

మహిళా మావోయిస్టు మంగ్లీ అరెస్ట్‌..
x
Highlights

ఛత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ అడవుల్లో కరడుకట్టిన మహిళా మావోయిస్టు కోసి అలియాస్ మంగ్లీని అరెస్ట్‌ చేశామని దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ తెలిపారు. అయితే...

ఛత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ అడవుల్లో కరడుకట్టిన మహిళా మావోయిస్టు కోసి అలియాస్ మంగ్లీని అరెస్ట్‌ చేశామని దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ తెలిపారు. అయితే మంగ్లీపై రూ. 5లక్షల రివార్డు ఉంది. గత2011 నుంచి మవోయిస్టుల్లో పనిచేస్తున్న మంగ్లీ భద్రతా దళాలు, గ్రామస్థులపై దాడి చేసిన కేసుల్లో నిందితురాలిగా ఉందని ఎస్పీ అభిషేక్ పేర్కొన్నారు. గత 2011 దళంలో పనిచేస్తున్నప్పటి నుండే మంగ్లీపై 10 కేసులు ఉన్నాయన్నారు. కాగా 2016లో సీఆర్ పీఎఫ్ బలగాలను చంపిన కేసు మరియు చోలనర్‌లో మందుపాతర పేల్చి ఐదుగురు పోలీసులను హతమార్చిన కేసులో మావోయిస్టు మంగ్లీ నిందితురాలని ఎస్పీ అభిషేక్ పేర్కొన్నారు. దంతెవాడ స్థానిక పోలీసులు, జిల్లా రిజర్వు గార్డులు కలిసి జల్లడపట్టి మంగ్లీని అరెస్టు చేశారని ఎస్పీ అభిషేక్ వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories