ప్రపంచ రికార్డు సృష్టించిన పోలవరం ప్రాజెక్టు

Polavaram project
x
Polavaram project
Highlights

పోలవరం ప్రాజెక్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. స్పిల్‌ చానల్‌లో 30వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రిట్‌ పనులు పూర్తికావడంతో పోలవరం గిన్నీస్‌ రికార్డును అధిగమించింది. 23 గంటల్లో 30వేల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులను పూర్తి చేశారు.

పోలవరం ప్రాజెక్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. స్పిల్‌ చానల్‌లో 30వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రిట్‌ పనులు పూర్తికావడంతో పోలవరం గిన్నీస్‌ రికార్డును అధిగమించింది. 23 గంటల్లో 30వేల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులను పూర్తి చేశారు. గిన్నిస్ రికార్డును అధిగమించినా పోలవరం పనులు కొనసాగుతూనే ఉన్నాయి. గిన్నిస్ బుక్ ప్రతినిధుల నుంచి అధికారికంగా సమాచారం అందిన తర్వాత ప్రభుత్వం, వరల్డ్ రికార్డుపై అధికారిక ప్రకటన చేయనుంది.

గిన్నిస్ రికార్డుపై అధికారిక ప్రకటన మధ్యాహ్నం తర్వాతే ఉండవచ్చని తెలుస్తోంది. నేడు పశ్చిమ గోదావరిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలవరం చేరుకోనున్నారు. గిన్నిస్ బుక్ ప్రతినిధుల చేతుల మీదుగా రికార్డును అందుకోనున్నారు. అదే సమయంలో పోలవరం కాంక్రీట్ పనుల గిన్నిస్ రికార్డుపై అధికారిక ప్రకటన చేయనున్నారు. అనంతరం, పోలవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టం అవిష్కృతం అయ్యింది. గిన్నిస్ రికార్డుకు మరో గంట సమయం మగిలి ఉండగానే పోలవరం కాంక్రీట్ పనులు రికార్డును అధికమించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సరికొత్త చరిత్ర నమోదయ్యింది. గిన్నీస్ రికార్డే లక్ష్యంగా నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కాంక్రీట్ పనులు ఇవాళ ఉదయం 7గంటలకు 30వేల క్యూబిక్ మీటర్లుకు చేరింది. దీంతో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం మరో రికార్డును సొంతం చేసుకుంది.

గిన్ని స్ బుక్ రికార్డు లక్ష్యంగా 30 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయాలనే లక్ష్యంతో నిన్న ఉదయం మొదలైన పనులు ఏకధాటిగా కొనసాగాయి. మొత్తం 24 మంది గిన్నిస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో ఫ్లడ్ లైట్ల వెలుతురు రాత్రంతా పనులు కొనసాగాయి. ప్రతి 15 నిమిషాలకోసారి గిన్నిస్ బుక్ ప్రతినిధులు కాంక్టీట్ పనుల లెక్కల్ని నమోదు చేసుకున్నారు. పనుల పురోగతికి సంబంధించిన వీడియోను ప్రతి గంటకు గిన్నిస్ ప్రతినిధులు లండన్ లోని తమ కార్యాలయానికి పంపించారు.

ఇక ప్రపంచ రికార్డు సృష్టించేందుకు వేలాది మంది కార్మికులు శ్రమించారు. 24 మంది ఇంజనీర్లు, 3 వేల మంది కార్మికులు, వెయ్యి మంది సాంకేతిక నిపుణులు చెమటోడ్చారు. ప్రతి 4 గంటలకు 5 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తి చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగారు. 6 జోన్లలో మొత్తం 300 బ్లాకుల్లో కాంక్రీట్ నింపే పనులు కొనసాగాయి. ఒక్కో బ్లాకులో 100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయి. రికార్డు అధిగమించిన ఇంకా పనులు కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories