Top
logo

పోచారంను స్పీకర్‌గా ప్రతిపాదిస్తూ కేసీఆర్ మొదటి సంతకం

పోచారంను స్పీకర్‌గా ప్రతిపాదిస్తూ కేసీఆర్ మొదటి సంతకం
Highlights

తెలంగాణ శాసనసభాపతి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. శాసనసభాపతి అభ్యర్థిగా బాన్సువాడ శాసనసభ్యుడు, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గురువారం అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు.

తెలంగాణ శాసనసభాపతి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. శాసనసభాపతి అభ్యర్థిగా బాన్సువాడ శాసనసభ్యుడు, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గురువారం అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే పోచారంను స్పీకర్‌గా ప్రతిపాదిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సంతకం చేశారు. పోచారం తరఫున మొత్తం ఆరు నామినేషన్లు సమర్పించారు. స్సీకర్ అభ్యర్థిత్వానికి అన్ని పార్టీలు మద్దతు తెలుపుతూ అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. పోచారం పేరును ప్రతిపాదించిన వారిలో సీఎం కేసీఆర్‌తోపాటు మల్లు భట్టి విక్రమార్క, అహ్మద్‌ బలాల, రేఖా నాయక్‌, అబ్రహం ఉన్నారు. కాగా అంతకు ముందు ముంతాజ్ అహ్మాద్ ఖాన్ నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.

Next Story