నేడు ఎల్బీ స్టేడియంలో బీజేపీ విజయ సంకల్ప సభ

నేడు ఎల్బీ స్టేడియంలో బీజేపీ విజయ సంకల్ప సభ
x
Highlights

తెలంగాణలో పట్టు సాధించేందుకు బీజేపీ ముమ్మర ప్రయత్నం చేస్తుంది. పార్టీ అగ్రనేతలు తెలంగాణలో వరుస సభలు నిర్వహిస్తూ బీజేపీ గ్రాఫ్ మరింత పెంచుకోవాలని...

తెలంగాణలో పట్టు సాధించేందుకు బీజేపీ ముమ్మర ప్రయత్నం చేస్తుంది. పార్టీ అగ్రనేతలు తెలంగాణలో వరుస సభలు నిర్వహిస్తూ బీజేపీ గ్రాఫ్ మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. విజయ సంకల్ప సభ పేరుతో నేడు (సోమవారం) ఎల్బీ స్టేడియంలో నిర్వహించే సభలో మోడీ పాల్గొనుండటంతో బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం బీజేపీ విజయ సంకల్ప సభ పేరుతో జరిగే ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొనున్నారు. పాలమూరులో మోడీ సభ విజయవంతం కావడంతో ఉత్సాహంతో ఉన్న బీజేపీ నేతలు ఎల్బీ స్టేడియంలో పీఎం సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.ఇక సభకోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో 8మంది అదనపు డీసీపీలు, 16మంది ఏసీసీలు, 80 మంది ఇన్ స్పె క్టర్లు , 160 మంది ఎస్సైలతో సెక్యూరిటీ టైట్ చేశారు.

తెలంగాణలో బీజేపీ పార్టీ బలపడుతోందని ఈ సభ తర్వాత తెలంగాణలో బీజేపీ బలం మరింత పెరుగుతుందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్‌తో ఆ పార్టీ నేతలు విసిగిపోయి బీజేపీలోకి వస్తున్నారన్న లక్ష్మణ్.. పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈ సభతో బీజేపీ కార్యకర్తలకు పరిచయం అవుతారన్నారు. మాజీమంత్రి విజయరామరావు కూడా బీజేపీలో చేరుతున్నారనీ సోమవారం సభతో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువస్తుందన్నారు. ఇక ఇప్పటివరకూ మూడు సభల్లో బీజేపీ హిందుత్వాన్ని టార్గెట్ చేస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఈ సభలో కౌంటర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories