అది మహా కల్తీ కూటమి

అది మహా కల్తీ కూటమి
x
Highlights

నిమిషానికో పంచ్ లైన్ కో రివర్స్ ఎటాక్ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో మోడీ ప్రసంగం ఆద్యంతం బిజెపి శ్రేణులు బల్లలు చరిచేలా...

నిమిషానికో పంచ్ లైన్ కో రివర్స్ ఎటాక్ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో మోడీ ప్రసంగం ఆద్యంతం బిజెపి శ్రేణులు బల్లలు చరిచేలా చేసింది కాంగ్రెస్ ను అంశాల వారీగా కడిగి పారేసిన మోడీ తన చివరి ప్రసంగంతో లోక్ సభ వేదికగానే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

దోపిడీ దారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించడానికే ప్రజలు తనను అధికారంలో కూర్చోబెట్టారన్నారు ప్రధాని మోడీ. మహా ఘట బంధన్ ఒక అవకాశవాద కూటమి అని విపక్షాల కూటమిని విమర్శించారు 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు, 55 నెలల బిజెపి పాలనకు మధ్య జరుగుతున్న యుద్దంగా 2019 ఎన్నికలను మోడీ అభివర్ణించారు. కాంగ్రెస్‌ది చాచాలు, మామాలు అధికారంలోకి తేవాలన్న తపన అని విరుచుకుపడ్డారు. లంచం లేనిదే కాంగ్రెస్ పనిచేయలేదని, ప్రతీ వ్యవస్థలోనూ దళారీలను చొప్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఎద్దేవా చేశారు. లోక్ సభలో చివరి సారి ప్రసంగించిన మోడీ పూర్తి ఎన్నికల ప్రసంగంలా మార్చేశారు.

రైతురుణ మాఫీ లాంటి పథకాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. బీసీ అంటే బిఫోర్ కాంగ్రెస్ అని ఏడీ అంటే ఆఫ్టర్ డైనాస్టీ అని మోడీ కొత్త నిర్వచనం ఇచ్చారు.

రాఫెల్ డీల్ పై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై ఎదురు దాడి చేశారు. దళారీలు లేకుండా రక్షణ ఒప్పందం కుదరడం కాంగ్రెస్‌కు కంటగింపుగా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొని సమాధానం చెప్పిన మోడీ దాదాపు రెండు గంటల పాటూ కాంగ్రెస్ పై ముప్పేట దాడి చేశారు. పదునైన పంచ్ లతో, విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ వారు దేశంలో అన్ని వ్యవస్థలనూ అవమనించారని మండిపడ్డారు సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇలా అన్ని వ్యవస్థలనూ తూలనాడారని ఎద్దేవా చేశారు. మాట మాటకో పంచ్ తో కాంగ్రెస్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.

దమ్ముంటే తనపై 2023లో తనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు మోడీ. దేశ ప్రజలు పూర్తి మెజారిటీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని అన్నారు. అధికారం కోసం ఎంత అడ్డదారులైనా విపక్షాలు తొక్కుతాయని, ఎవరి కాళ్లు పట్టుకోడానికైనా రెడీ అని విమర్శించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories