Top
logo

తెలంగాణలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు : మోదీ

తెలంగాణలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు : మోదీ
X
Highlights

జాతీయస్థాయిలో భాజపాను ఎదుర్కోనేందుకు కూటమి, ఫెడరల్ ప్రంట్‌లు ఏర్పాటు యత్నాలపై భారత ప్రధాని మోడీ పక్కకు తోసిపుచ్చారు. మోడీ ఓటమే అజెండాగా ఏకమవడాన్ని తప్పకుండా ప్రజలు తిప్పికొడతారని మోడీ అన్నారు.

జాతీయస్థాయిలో భాజపాను ఎదుర్కోనేందుకు కూటమి, ఫెడరల్ ప్రంట్‌లు ఏర్పాటు యత్నాలపై భారత ప్రధాని మోడీ పక్కకు తోసిపుచ్చారు. మోడీ ఓటమే అజెండాగా ఏకమవడాన్ని తప్పకుండా ప్రజలు తిప్పికొడతారని మోడీ అన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగం విఫలమైందని మోడీ అన్నారు. తెలంగాణపై చంద్రబాబు ద్వేషంతో రాజకీయం చేయాలనుకున్నారని అందుకే తెలంగాణ ఎన్నికల్లో కంగుతిన్నారని మోడీ తెలిపారు. ఆ ఆక్రోశంతోనే చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని మోడీ అన్నారు. మోడీ ఆశీర్వాదంతోనే సీఎం కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ ఏర్పాటు చేస్తున్నారనే సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను మోడీ స్పందిస్తూ కేసీఆర్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నారన్న విషయమే తెలియదని ప్రధాని మోదీ అన్నారు. మోదీ కోసమే కేసీఆర్‌ ఫ్రంట్ సన్నాహాలు చేస్తున్నారన్న చంద్రబాబు విమర్శలకు మోదీ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి చొరవ చూపిన చంద్రబాబు మాత్రం ఘోరంగా విఫలమయ్యారన్నారు.

Next Story