నేను అవీనితికి పాల్పడితే నిరోపించాలి .. మోడీ

నేను అవీనితికి పాల్పడితే నిరోపించాలి .. మోడీ
x
Highlights

తానూ అక్రమంగా సొమ్ము సంపాదించినట్లు అయితే నిరూపించాలని ప్రధానమంత్రి మోడీ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు . ఎన్నికలు చివరి దశకు చేరుకోవడంతో అయన ఈ వాఖ్యలు...

తానూ అక్రమంగా సొమ్ము సంపాదించినట్లు అయితే నిరూపించాలని ప్రధానమంత్రి మోడీ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు . ఎన్నికలు చివరి దశకు చేరుకోవడంతో అయన ఈ వాఖ్యలు చేసారు . ఉత్తరప్రదేశ్ లోని బల్లియా , బీహార్ లోని సాసార్ ,బక్సర్ , చండీఘర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మోడీ ప్రసగించారు .

నేను అక్రమంగా సొమ్ము సంపాదించానా ? ఆస్తులు కూడబెట్టనా ? ఉంటే నిరూపించండి అంటూ బహిరంగానే సవాల్ విసురుతున్నానని అయన అన్నారు . నేనెప్పుడు ధనవంతున్ని కావాలని అనుకోలేదని పేదల ధనాన్ని దోచుకోలేదని అయన అన్నారు . తన జీవితం ఎప్పుడు తెరచిన పుస్తకమేనని నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి ప్రజలే తమ ఓట్ల ద్వారా బుద్ది చెపుతారని వాఖ్యానించారు .

ఇదే సభలో కాంగ్రెస్ పై విమర్శల దాడికి దిగారు మోడీ . ఓటు వేసే ముందు కాంగ్రెస్ నాయకుల అక్రమ సంపాదనను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని అయన ప్రజలకు విజ్ఞప్తి చేసారు . ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే ఎస్పీ-బీఎస్పీ కొట్టుకుంటున్నాయని ఇక అధికారంలోకి వస్తే కొట్టుకోరని గ్యారేంటి ఏంటని అయన ప్రశ్నించారు . లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జెడి ఎన్నికల గుర్తుపై మోడీ స్పందిస్తూ రాష్ట్రాన్ని వాళ్ళు తిరిగి విద్యుత్ లేని లాంతర్ కాలానికి తీసుకువెళ్తారని వాఖ్యానించారు .

Show Full Article
Print Article
Next Story
More Stories