మోడీ బయోపిక్‌కు ఈసీ బ్రేక్‌

మోడీ బయోపిక్‌కు ఈసీ బ్రేక్‌
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కావాల్సి ఉన్న నరేంద్రమోడీ బయోపిక్‌ మూవీకి ఈసీ బ్రేకేసింది. మోడీ బయోపిక్‌ మూవీ ప్రివ్యూను వీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం...

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కావాల్సి ఉన్న నరేంద్రమోడీ బయోపిక్‌ మూవీకి ఈసీ బ్రేకేసింది. మోడీ బయోపిక్‌ మూవీ ప్రివ్యూను వీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈ నిర్ణయం తీసున్నారు. మోడీ బయోపిక్‌ మూవీపై అభ్యంతరాలు చెప్పిన ఈసీ ఎన్నికలవేళ ఎలా రిలీజ్‌ చేస్తారని ప్రశ్నించింది. దాంతో రేపు విడుదల కావాల్సిన మోడీ బయోపిక్‌ మూవీ విడుదల వాయిదా పడింది. అయితే ఎన్నికలు అయిన తర్వాత సినిమాను విడుదల చేసుకోవచ్చని ఈసీ సూచించింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్రతో 'పీఎం నరేంద్రమోదీ' పేరుతో రూపొందిన ఈ సినిమాలో వివేక్‌ ఒబరాయ్‌ మోదీ పాత్ర పోషించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories