సర్జికల్ స్ట్రైక్స్‌ చేసే యోచనలో కేంద్రం ..!

సర్జికల్ స్ట్రైక్స్‌ చేసే యోచనలో కేంద్రం ..!
x
Highlights

శ్రీనగర్ ఉగ్ర ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణిగస్తోంది. దేశ భద్రతలో ఎలాంటి రాజీ ఉండబోదని ఇప్పటికే పలు సార్లు స్పష్టం చేసిన కేంద్రం భారత సైనికులను...

శ్రీనగర్ ఉగ్ర ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణిగస్తోంది. దేశ భద్రతలో ఎలాంటి రాజీ ఉండబోదని ఇప్పటికే పలు సార్లు స్పష్టం చేసిన కేంద్రం భారత సైనికులను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడంపై తగిన గుణపాఠం చెప్పాలని భావిస్తోంది. దీనిపై చర్చించేందుకు కేంద్ర కేబినెట్ కాసేపట్లో ‎ భేటి కానుంది. ప్రధాన మంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశేంలో ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీతో పాటు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరుకానున్నారు. ఇప్పటికే పాకిస్ధాన్‌ను తీవ్రంగా హెచ్చరిస్తూ విదేశాంగ శాఖ ఘాటైన లేఖ రాసింది. ఉగ్రవాదులకు సహకరిస్తున్న పాకిస్ధాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని కేంద్రం బలంగా భావిస్తోంది. ఇందులో భాగంగా మరోసారి సర్జికల్ స్ట్రైక్స్‌ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories