కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుకు రంగం సిద్దం...ఈ నెల 24న...

కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుకు రంగం సిద్దం...ఈ నెల 24న...
x
Highlights

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుకై కేంద్రం వేగం పెంచింది. ఈ నెల 18 వ తేదీ వరకు రైతుల అన్ని వివరాలు సేకరించేందుకు డెడ్ లైన్ పెట్టుకుంది. ...

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుకై కేంద్రం వేగం పెంచింది. ఈ నెల 18 వ తేదీ వరకు రైతుల అన్ని వివరాలు సేకరించేందుకు డెడ్ లైన్ పెట్టుకుంది. గ్రామసభల ద్వారా వెరిఫై చేసిన వెంటనే రైతుల వివరాలను అన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసేందుకు అధికారులు రంగం సిద్దం చేశారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ అధనపు కార్యదర్శి మరో సారి తెలంగాణ వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం అయ్యారు.

దేశవ్యాప్తంగా రైతలకు భరోసా ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుకు రంగం సిద్దం చేశారు. ఈ నెల 24న ఈ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోఢీ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ పథకం తరహలో తెలంగాణలో అమలౌతున్న రైతు బంధు పథకంపై అధ్యయనం చేశారు అధికారులు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వివరాలు కొన్ని ఇప్పటికే కేంద్రానికి చేరాయి. మరికోన్ని వివరాలు ఈ నెల 18 వ తేదిలోపు చేరున్నాయి. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ అధనపు కార్యదర్శి వసధు మిశ్రా తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. రైతుబందు, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంపై చర్చించినట్లు తెలిపారు.

తెలంగాణ‌లో ఇప్ప‌టికే రైతు బంధు ప‌థ‌కం అమ‌ల‌వుతున్నందున ఇక్క‌డి నుంచే కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కాన్ని కూడా అమ‌లు చేస్తే బాగుంటుంద‌నే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం ఆ దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు తెలిస్తోంది. కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం 2018 డిసెంబ‌ర్ నుంచే అమ‌లులోకి వ‌చ్చింద‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ బ‌డ్జెట్ ప్ర‌సంగంలో వెల్ల‌డించారు. కాగా ఈ ప‌థ‌కం కోసం కేంద్రం రూ.75వేల కోట్ల నిధుల‌ను కూడా ఇప్ప‌టికే బ‌డ్జెట్‌లో కేటాయించింది. 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను రైతుకు ఆర్థిక మ‌ద్ద‌తు కింద కేంద్ర ప్ర‌భుత్వం రూ.20వేల కోట్ల‌ను ఖ‌ర్చు చేయ‌నుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న 12 కోట్ల మంది రైతుల‌కు ల‌బ్ది చేకూరుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories