విమానం న‌డుపుతూ నిద్రపోయిన పైలట్.. 40 నిమిషాలు..

విమానం న‌డుపుతూ నిద్రపోయిన పైలట్.. 40 నిమిషాలు..
x
Highlights

ప్రతి మనిషికి తిండి, నిద్ర చాలా అవసరం. మరీ ముఖ్యం విమానాలు నడాపే పైలట్‌కు అయితే మరీ అవసరం. ఈ రెండు కానీ లేకపోతే ఎవరు కూడా సరిగ్గా పనిచేయలేరు. ఓ ...

ప్రతి మనిషికి తిండి, నిద్ర చాలా అవసరం. మరీ ముఖ్యం విమానాలు నడాపే పైలట్‌కు అయితే మరీ అవసరం. ఈ రెండు కానీ లేకపోతే ఎవరు కూడా సరిగ్గా పనిచేయలేరు. ఓ ట్రైనీ పైలట్‌ నిద్రలేకపోవడంతో విమానం నడుపుతూ నిద్రపోయాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ పైలట్‌ శిక్షణా సంస్థలో జరిగింది. ఆ పైలట్‌కు తలనొప్పి రావడంతో విమానాన్ని ఆటోపైలట్ మోడ్‌లో పెట్టి మొళ్లిగా నిద్రలోకి జారుకున్నాడు. అలా దాదాపు 5500 అడుగుల ఎత్తులో 40 నిమిషాల పాటు విమానం ఆటో మోడ్‌లో ప్రయాణించింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ నివేదికను (ఏటీఎస్‌బీ) విడుదల చేసింది. మార్చి 9న జరిగిన ఈ ఘటనను ఏటీఎస్‌బీ తీవ్రంగా పరిగణించింది. కాగా సదరు ట్రైనీ పైలట్‌కు ముందు రోజు నిద్ర లేదని, విమానం నడిపే ముందు టీఫిన్ కూడా తీసుకోకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని తెలిపారు. పైలట్‌ల నిద్ర, తిండి విషయంలో తాము అనేక జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నామన్నారు.

కాగా మార్చి 9 ఉదయం 11 గంటల సమయంలో ఆ విమానం అడిలైడ్‌ విమానాశ్రయం నియంత్రణలోని గగన తలంలోకి వచ్చింది. తాము ఎలాంటి సూచనలు ఇవ్వకుండా విమానం తమ పరిధిలోకి రావడంతో అనుమానం వచ్చిన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది పలుసార్లు ట్రెయినీ పైలట్‌ను సంప్రదించినా లాభం లేకపోయింది. ఇక అదే విమానానికి సమీపంలో ప్రయాణిస్తున్న మరో విమానం ద్వారా ప్రయత్నించగా పైలట్‌కు స్పృహ వచ్చింది. ఇక దీంతో విమానాన్ని సేఫ్‌గా అడెలైడ్ ప్యారాఫీల్డ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories