మీ ఓటు ఎవరికేశారు ? గోదావరి జిల్లాల ఓటర్లకు ఫోన్స్..

మీ ఓటు ఎవరికేశారు ? గోదావరి జిల్లాల ఓటర్లకు ఫోన్స్..
x
Highlights

ఏపీ సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసింది. ఇక కేవలం ఫలితాలకోసం ఇటు పార్టీనేతలు, ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళకు ఇంకో నెలరోజులు మాత్రమే మిగిలి...

ఏపీ సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసింది. ఇక కేవలం ఫలితాలకోసం ఇటు పార్టీనేతలు, ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళకు ఇంకో నెలరోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఎన్నికల్లో ప్రజలు ఎటె మొగ్గుచూపరో తెలుసుకోవడానికి ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తాము మళ్లీ తిరిగి అధికార పగ్గాలు చేతికి వస్తాయా? టీడీపీ, ఇక ఈసారైనా తమకు అధికారం దక్కుతుందా లేదా అని వైసీపీ. ఇలా ఇరు పార్టీ నేతలు తెగ టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటర్లు ఎవరికి మొగ్గుచూపారు? ఎవరికి తమ ఆమూల్యమైన ఓటును వినియోగించారని తెలుసుకోవడానికి మరోసారి సర్వేలపైనే నమ్మకం పెట్టుకున్నారు కొందరు నేతలు. ఇక ప్రధాన రాజకీయ పార్టీలు గోదావరి జిల్లాల ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపారనే విషయం కనుక్కోవాడానికి తీవ్ర ఆసక్తి చూపుతున్నట్లు జోరుగానే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించేది ఉభయ గోదావరి జిల్లాలే అనే విషయం తెలిసిందే.

గత2014 ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు టీడీపీకి రావడం వల్లే ఆ పార్టీ అధికారంపగ్గాలు చేపట్టింది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా తమకే మెజార్టీ సీట్లు వస్తాయని వైసీపీ అనుకుంటోంది. అయితే ఈ రెండు జిల్లాల్లో వైసీపీ, టీడీపీ ఫలితాలకు గండివేసేందుకు జనసేన పవన్ కళ్యాణ్ రంగంలో ఉండటంతో ఓటరన్నలు ఎవరికి జైకొట్టారని తెలుసుకొవాడానికి గోదావరి జిల్లాల ఓటర్లకు సర్వే పేరుతో ఫోన్ కాల్స్ వస్తునట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువగా ఫోన్ కాల్స్ హైదరాబాద్ మహానగరం, బెంగళూరు నుండే వస్తున్నాయని కొందరు చెప్పుకొస్తున్నారు. కాగా ఎన్నికల ఫలితాలపై మరో డేగ కన్నులాగా బెట్టింగ్ రాయుళ్లు ఉన్న విషయం తెలిసిందే కదా. అయితే ఈ ఫోన్ కాల్స్ బెటింగ్స్ కోసం బుకీలు కూడా ఇలాంటి పనులు చేస్తుంటారనే వార్త వినిపిస్తోంది. అయితే మొత్తానికి ఎన్నికల ముందు మీ ఆమూల్యమైన ఓటు మాకంటే మాకేనని ఫోన్ కాల్స్ చేసిన నేతలే ఇప్పుడు ఓట్లు ముగిసిన తరువాత కూడా ఓటు ఎవరికి గుద్దవ్ అంటూ ఫోన్ చేసి అడగడం చికాకు తెప్పిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories