logo

బెజవాడలో పెట్రో బాంబ్ కలకలం...వివాహేతర సంబంధం నేపథ్యంలో....

బెజవాడలో పెట్రో బాంబ్ కలకలం...వివాహేతర సంబంధం నేపథ్యంలో....
Highlights

కృష్ణా జిల్లాలో పెట్రో కెమికల్ బాంబులు కలకలం సృష్టించాయి. మచిలీపట్నం సుకర్లబాద్ లో ఓ ఇంటి తలుపులకు, ద్విచక్ర...

కృష్ణా జిల్లాలో పెట్రో కెమికల్ బాంబులు కలకలం సృష్టించాయి. మచిలీపట్నం సుకర్లబాద్ లో ఓ ఇంటి తలుపులకు, ద్విచక్ర వాహనానికి పెట్రో కెమికల్ బాంబులు అమర్చినట్లు గుర్తించారు. ఇంటి గుమ్మం ముందు తలుపులు తీసేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పెట్రో బాంబులు భారీ శబ్దంతో పేలాయి. పేలుడు ధాటికి తలువులు విరిగిపడ్డాయి. ఇంట్లోని వంటగది తలుపులకు కూడా అమర్చి ఉన్న పెట్రో బాంబులను గుర్తించారు. పెట్రో కెమికల్ బాంబులను గుర్తించిన మహిళ పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న బాంబు స్క్వాడ్ బాంబువలను నిర్వీర్యం చేసేందుకు యత్నించారు. అయితే వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడే పెట్రో కెమికల్ బాంబులను అమర్చినట్లు పోలీసులు గుర్తించారు.


లైవ్ టీవి

Share it
Top