సుప్రీం కోర్టులో ఆర్‌.కృష్ణయ్యకు చుక్కెదురు

సుప్రీం కోర్టులో ఆర్‌.కృష్ణయ్యకు చుక్కెదురు
x
Highlights

సుప్రీం కోర్టులో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యకు చుక్కెదురైంది. పంచాయతి రాజ్ చట్టాన్ని సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను...

సుప్రీం కోర్టులో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యకు చుక్కెదురైంది. పంచాయతి రాజ్ చట్టాన్ని సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్ధానం కొట్టివేసింది. గతంలో 34 శాతంగా బీసీల రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించడంపై కృష్ణయ్య అభ‌్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్ధకు విరుద్ధంగా రిజర్వేషన్లను తగ్గించారంటూ కృష్ణయ్య తరపు న్యాయవాది వాదించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం రిజర్వేషన్లు ఎంత శాతం ఉన్నాయంటూ ప్రశ్నించింది. నిబంధనలకు అనుగుణంగా 50 శాతం లోపే రిజర్వేషన్లు ఉన్నందున ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషనర్‌కు సూచించింది. అనంతరం పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories