ప్రచార సభలో స్టేజ్‌‌పై ఒక్కసారిగా కిందపడ్డ పవన్ కల్యాణ్..

ప్రచార సభలో స్టేజ్‌‌పై ఒక్కసారిగా కిందపడ్డ పవన్ కల్యాణ్..
x
Highlights

అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడం ఒక్కోసారి రాజకీయనేతలకు ఇబ్బందికరంగా మారుతుంది. తాజాగా, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కు అలాంటి పరిస్థితే...

అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడం ఒక్కోసారి రాజకీయనేతలకు ఇబ్బందికరంగా మారుతుంది. తాజాగా, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కు అలాంటి పరిస్థితే ఎదురైంది. పవన్ ప్రసంగిస్తుండగా స్టేజ్ వెనుక భాగం నుంచి వచ్చిన ఓ అభిమాని ఆయన కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. రెండు కాళ్లు పట్టుకోవడంతో పట్టు కోల్పోయిన పవన్ ఒక్కసారిగా కిందపడిపోయారు. కాగా ప్రచార సభ మొదలైన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. పవన్ పట్టుకుని ఉన్న మైక్ కూడా విరిగిపోయింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పవన్‌ను పైకి లేపారు. అనంతరం ఆ అభిమానిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. విజయనగరంలో అయోధ్య మైదానంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ వేదికపైకి పవన్‌ చేరుకున్న కాసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories