గాజవాకలో పవన్ గెలుపు, ఒటమిపై ఫృథ్వీ ఎమన్నాడంటే..

గాజవాకలో పవన్ గెలుపు, ఒటమిపై ఫృథ్వీ ఎమన్నాడంటే..
x
Highlights

ప్రముఖ సినీ నటుడైనా ఫృథ్వీ మొన్నటి దాకా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫునా విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. కాగా వైసీపీ అధినేత...

ప్రముఖ సినీ నటుడైనా ఫృథ్వీ మొన్నటి దాకా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫునా విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. కాగా వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గెలుపే ల‍క్ష్యంగా ప్రచారంలో దూసుకపోయారు. ఇక ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చూస్తూ వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాగబాబులను ఎండగడుతూ దుమ్మెత్తిపోశారు. ఇక ఏపీలో ఎన్నికల ఘట్టం ముగిసింది. ఇక గెలుపు ఓటములు, ఎన్నికల ఫలితాలపై సమీక్షలు చెబుతున్నారు ఫృథ్వీ. అయితే ఏపీలో పోటీచేసిన జనసేన పార్టీ ఎక్కడెక్కడ ఓడిపోతుంది.? కాగా గాజువాక బరిలో దిగిన పవన్ కళ్యాణ్ ఎన్నికల రణరంగంలో విజేతగా నిలుస్తారో లేక పరాజీతులుగా మిగిలిపోతారా అన్న దానిపై ఫృథ్వీ కుండబద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చారు. అయితే ఫృథ్వీ తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు.

గత 2014 ఎన్నికల్లో తమ పార్టీ విజయకేతం ఎగురవేస్తోందని భావించామని కానీ కొన్ని చిన్న చిన్న కారణాలు, కుట్రలు కుతంత్రాల వల్లే ఓడిపోయామని అన్నారు. ఈసారి మాత్రం అఖండ మెజార్టీతో గెలుస్తున్నామని ఫృథ్వీ స్పష్టం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో స్థానికత బాగా ప్రభావం చూపిందని హైదరాబాద్ నుంచి కోస్తా జిల్లాల్లో పోటీచేసిన పవన్‌ కళ్యాణ్‌కు ఇదే పెద్ద మైనస్ అయ్యిందని ఫృథ్వీ చెప్పుకొచ్చారు. కేవలం లోకల్ లీడర్లకే మాత్రమే ప్రజలు పట్టం కడుతారని అన్నారు. ఇక ఎన్నికల్లో జనసేనాని పోటీచేసిన గాజువాక అసెంబ్లీలోఅక్కడ రెండు సార్లు గతంలో పోటీచేసిన నాగిరెడ్డిపై ఈసారి ప్రజల సానుభూతి బాగా పనిచేసిందని, ఇక విద్యార్థులు ఫ్రొఫెసర్లు నాగిరెడ్డికే పూర్తి మద్దతునిచ్చారని ఇదే నాగిరెడ్డి గెలుపునకు ఇదే దోహదపడుతోందని ఫృథ్వీ వివరించారు. అందుకే గాజువాకలో జనసే అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఖచ్చితంగా ఓడిపోతాడని పోలింగ్ సరళి చెబుతోందని ఫృథ్వీ బాంబు పేల్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories