అధికారంలో ఉన్నా లేకున్నా సినిమాలు చేయను : పవన్

అధికారంలో ఉన్నా లేకున్నా సినిమాలు చేయను : పవన్
x
Highlights

పవన్ కళ్యాణ్ ఎప్పటికి ఎవరి అంచనాలకు అందడు . అయన ఎప్పుడు ఎ నిర్ణయం తీసుకుంటారో ఆయనకే తెలియదు . సినిమాలలో మంచి స్టార్ట్ హీరోగా ఎదిగారు పవన్ . మెగాస్టార్...

పవన్ కళ్యాణ్ ఎప్పటికి ఎవరి అంచనాలకు అందడు . అయన ఎప్పుడు ఎ నిర్ణయం తీసుకుంటారో ఆయనకే తెలియదు . సినిమాలలో మంచి స్టార్ట్ హీరోగా ఎదిగారు పవన్ . మెగాస్టార్ చిరంజీవిని మించిన ఫాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు అయన .. అయనతో ఒక్క సినిమా అని వెంటబడుతున్న దర్శకనిర్మాతలకు షాక్ ఇస్తూ జనసేన పార్టీ పెట్టారు అయన ..

ఈ ఎన్నికల్లో అయన పోటి చేసారు . మే 23 న ఎన్నికల ఫలితాలు రానున్నాయి .పవన్ కి వచ్చే సీట్లను బట్టి అయన కింగ్ అయ్యే ఛాన్స్ లేకపోయినా కింగ్ మేకర్ అవుతాడని మరికొందరు అంటున్నారు . కష్టమేనని మరికొందరు భావిస్తున్నారు . ఈ ఎన్నికల్లో పవన్ ది కీ రోల్ కాకపోతే మళ్లీ సినిమాల వైపే అయన మొగ్గు చూపుతారని ఈ మధ్య కధనాలు వస్తున్నాయి .

మైత్రి మూవీస్ దగ్గర పవన్ అడ్వాన్సులు తీసుకున్నాడని ఆయన తిరిగి సినిమాలు చేయడం పక్కా అని వార్తలు వచ్చాయి . అయితే దీనిపైన పవన్ మొన్న జరిగిన కార్యకర్తల మీటింగ్ లో క్లారిటీ ఇచ్చేసాడు. అధికారంలోకి వచ్చినా రాకపోయినా వచ్చే 25 ఏళ్ళే టార్గెట్ గా జనసేన పనిచేస్తుందని, ప్రజల సమస్యలే ఎజెండా గా పనిచేస్తామని క్లారిటీ ఇచ్చాడు . దీనితో పవన్ మళ్లీ సినిమాలు చేస్తాడని వస్తున్న కధలకు చెక్ పెట్టినట్టు అయింది .

Show Full Article
Print Article
Next Story
More Stories