logo

సైకిల్ చైన్ ఎప్పుడో తెగిపోయింది...ఫ్యాన్‌కు పవర్ లేకుండా చేస్తాం: పవన్

సైకిల్ చైన్ ఎప్పుడో తెగిపోయింది...ఫ్యాన్‌కు పవర్ లేకుండా చేస్తాం: పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాన్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, వైసీపీలను టార్గెట్ చేస్తున్నారు. నిడదవోలులో జరిగిన బహిరంగ సభలో పవన్ టీడీపీ, వైసీపీలపై ఘాటు విమర్శలు చేశారు. ఏపీ రాజకీయాలు రెండు కుటుంబాలకే పరిమితం కావాలా అని ప్రశ్నించారు. సైకిల్ చైన్ ఎప్పుడో తెగిపోయిందని ఫ్యాన్‌కు పవర్ లేకుండా చేస్తామని పవన్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే నిడదవోలులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడతామని పవన్ క‌ళ్యాణ్‌ అన్నారు. నిడదవోలు ఏరియా ఆస్పత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. రాజమహేంద్రవరం జనసేన ఎంపీ అభ్యర్థి ఆకుల సత్యనారాయణను, అలాగే నిడదవోలు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అటికల రమ్యశ్రీని భారీ మెజార్టీతో గెల‌పించాల‌ని కోరారు.

లైవ్ టీవి

Share it
Top