logo

ఎవరి మాటలూ నమ్మొద్దు.. వాళ్లతో మాత్రమే కలుస్తాం: జనసేన

ఏపీలో పొత్తులపై జనసేన క్లారిటీ ఇచ్చింది. టీడీపీతో కలిసి రావాలన్న చంద్రబాబు ప్రతిపాదనను జనసేన అధినేత పవన్‌ తిరస్కరించారు. వామపక్షాలతో తప్ప ఎవరితూనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. పొత్తులపై టీడీపీ, వైసీపీ మాటలు నమ్మొద్దని జనసేన కార్యకర్తలకు పవన్‌ సూచించారు.

Pawan KalyanPawan Kalyan

ఆంధ్రప్రదేశ్ అసంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన పార్టీ అధికారికంగా స్పష్టం చేసింది. వామపక్ష పార్టీలతో తప్ప మరే ఇతర పార్టీతో కలసి వెళ్లమని తెలిపింది. ఈ మేరకు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఎన్నికలలో యువత, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. పొత్తులపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మాటలను నమ్మవద్దని పార్టీ శ్రేణులకు సూచించింది. అధికార ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించాలని ముక్తకంఠంతో ఖండించాలని కోరింది.

ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు జనసేన తమతో పోటీ చేస్తే జగన్ కు నొప్పేంటని ప్రశ్నించారు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యింది. దీంతో టీడీపీతో, జనసేన చేతులు కలపబోతోందా? అనే అనుమానాలు కూడా పలువురిలో కలిగాయి. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ జనసేన తమ భవిష్యత్ కార్యాచరణ గురించి క్లారిటీ ఇచ్చింది.

లైవ్ టీవి

Share it
Top