logo

జగన్ మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ సవాల్..

జగన్ మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ సవాల్..
Highlights

రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించారు. 13 జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ నేతలు,...

రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించారు. 13 జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఇక్కడ నుంచే ఎన్నికల ప్రచారాన్ని పవన్ ప్రారంభించారు. ఈ సభకు యుద్ధ శంఖారావంగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. కేవలం బీసీల మహాసభలు పెట్టి వారి కోసం ప్రత్యేకంగా వరాలు ప్రకటించడం తమ పార్టీకి రాదన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ బీసీ సభలు పెట్టదని స్పష్టం చేశారు. తాము ప్రకటించిన 32 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో బీసీలకు అండగా ఉన్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కడప పార్లమెంట్ సీటు బీసీకి ఇవ్వగలరా..? పులివెందుల అసెంబ్లీ సీటు బీసీకి ఇవ్వగలరా..? జగన్ తన కుటుంబాన్ని కాదని వేరే వారికి సీట్లు ఇవ్వగలరా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జగన్‌ని తాను పాలసీల మీద విమర్శిస్తే, వారు మాత్రం తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని పవన్ అన్నారు. తనను ఏమీ అనలేక పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారని పవన్ ఆరోపించారు. జనసేన పార్టీ ఐదో ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.


లైవ్ టీవి


Share it
Top