logo

రాప్తాడు బరిలో పరిటాల వారసుడు...కొడుకు కోసం...

రాప్తాడు బరిలో పరిటాల వారసుడు...కొడుకు కోసం...
Highlights

పరిటాల కుంబానికి ఎన్ని సీట్లు రానున్నాయి ఒక సీటు రానుందా..? రెండు సీట్లు వస్తాయా..? ఒకే స్థానం కేటాయిస్తే...

పరిటాల కుంబానికి ఎన్ని సీట్లు రానున్నాయి ఒక సీటు రానుందా..? రెండు సీట్లు వస్తాయా..? ఒకే స్థానం కేటాయిస్తే పరిటాల సునీత పరిస్థితి ఏంటి కొడుకు కోసం రాప్తాడును త్యాగం చేస్తారా..? అధిష్టానం ఏమంటుంది.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతోన్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను ఎన్నికల బరిలోకి దించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి తమ కుటుంబానికి రాప్తాడు తో పాటు మరో అసెంబ్లీ స్థానం కేటాయించాలని టీడీపీ అధిష్టానాన్ని సునీత కోరుతున్నారు. అందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అంగీకరించకపోతే తాను పోటీకి దూరంగా ఉంటానని ఆమె నిర్ణయించుకున్నారు.

అదిష్టానం ఒకే సీటు కేటాయిస్తే రాప్తాడు నుంచి శ్రీరామ్ పోటీ చేయించాలని ఆమె నిర్ణయించారు. మరోవైపు గత ఎన్నికల నుంచి పార్టీ వ్యవహారాల్లో పరిటాల శ్రీరామ్‌ క్రియాశీలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. మంత్రిగా తల్లి సునీత ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉన్న సమయాల్లో కార్యకర్తలకు, నేతలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడుకు శ్రీరామ్‌ను రాప్తాడు నుంచి అసెంబ్లీ బరిలోకి దించాలని డిసైడ్ అయ్యారు. సీట్ల వ్యవహారం గురించి శ్రీరామ్‌తో కలిసి పరిటాల సునీత ఈరోజు సీఎం చంద్రబాబును కలుస్తారు.‎ మొత్తంగా చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సునీత తేల్చిచెప్పారు.

లైవ్ టీవి

Share it
Top