ఆత్మహత్యలు నిజం కావా... బోర్డు తిరగేసిన ఇంటర్‌ ఏం చెబుతోంది?

ఆత్మహత్యలు నిజం కావా... బోర్డు తిరగేసిన ఇంటర్‌ ఏం చెబుతోంది?
x
Highlights

విద్యార్థుల ఆత్మహత్యపై తెలంగాణ ఇంటర్ బోర్డు సమర్ధించుకుంది. అందులో తమ తప్పేమీ లేదన్నట్టు చెబుతోంది. ఇంటర్మీడియట్‌లో ఫెయిలయ్యామని, ఆత్మహత్య చేసుకున్న...

విద్యార్థుల ఆత్మహత్యపై తెలంగాణ ఇంటర్ బోర్డు సమర్ధించుకుంది. అందులో తమ తప్పేమీ లేదన్నట్టు చెబుతోంది. ఇంటర్మీడియట్‌లో ఫెయిలయ్యామని, ఆత్మహత్య చేసుకున్న 23 మంది విద్యార్థుల ఆన్సర్ షీట్లన్నీ మళ్లీ ప్రత్యేకంగా రీ వాల్యూయేషన్, రీ వెరిఫికేషన్ చేశామని, ఆ విద్యార్థులంతా నిజంగానే ఫెయిలయ్యారని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ప్రకటించారు. వారి ఆత్మహత్యలతో ఇంటర్ బోర్డుకు సంబంధం లేదని ఆయనకు ఆయన సొంతంగా క్లీన్ చిట్ ఇచ్చుకున్నారు. ఇంటర్ వ్యవహారాల్లో తనకు మరక అంటకుండా ఆయన తాపత్రయం పడుతున్నారు.

ఇంటర్ బోర్డు వ్యవహారంలో జరిగిన అవకతవకల ప్రచారంలో ఆందోళనకు గురి కాని.., ఒక్క ఇంటర్ విద్యార్థి కూడా లేడంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. రాసిన వారిలో కనీసం 30 శాతం మంది తమ ఎగ్జామినేషన్ పేపర్లు తమకు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణ తీరుపై విద్యార్థుల్లో ఏర్పడిన అనుమానాలు ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయో అర్ధమైపోతుంది. 99 మార్కులు వచ్చిన విద్యార్థులకు సున్నా మార్కులేసింది నిజం. ఇప్పటికీ కొన్ని వందల మందికి అలా మార్కుల్లో మార్పులు జరిగాయన్నది కూడా నిజం. ఫెయిలైన 3లక్షల మందిపైగా విద్యార్థుల్లో రీ వెరిఫికేషన్, రీ వాల్యుయేషన్‌లలో కనీసం 3శాతం మంది పాస్ అవుతున్నట్టుగా ఇంటర్ బోర్డు అధికారులే చెబుతున్నారు. అలాంటప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలకు, తమకు సంబంధం లేదని చెప్పుకోవడానికి ఎందుకు తాపత్రయ పడుతున్నారని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

విద్యార్థుల హత్మహత్యలతో ఇంటర్ బోర్డుకు సంబంధం లేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ నివేదికపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు.

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలోని మడుర్ గ్రామంలో ఏప్రిల్ 23న రాజు అనే ఇంటర్ విద్యార్థి ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై స్కూల్ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. అయితే, ఇంటర్ బోర్డు నివేదికలో ఫెయిల్ అయిన కారణంగా విద్యార్థులు చనిపోలేదని చెప్పడం ప్రభుత్వ కుట్రని తల్లిదండ్రలు మండిపడుతున్నారు. పేపర్లు దిద్దడంలో తప్పులు జరగడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని రాజు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కుటుంబాన్ని పోషించే పెద్ద కొడుకు చనిపోయాడని, తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories