పాకిస్తాన్‌లో యుద్ధ నగారా ....వార్ జోన్ రెడీ చేస్తున్న...

పాకిస్తాన్‌లో యుద్ధ నగారా ....వార్ జోన్ రెడీ చేస్తున్న...
x
Highlights

పాకిస్తాన్ కయ్యానికి కాలుదువ్వుతోందా..? భారత్‌పై యుద్ధానికి దాయాది దేశం సన్నద్ధమవుతోందా..? యుద్దం వస్తుదంటూ పాకిస్తాన్ ముందస్తు జాగ్రత్తలు...

పాకిస్తాన్ కయ్యానికి కాలుదువ్వుతోందా..? భారత్‌పై యుద్ధానికి దాయాది దేశం సన్నద్ధమవుతోందా..? యుద్దం వస్తుదంటూ పాకిస్తాన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటుందా..? పక్క దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే వార్ సైరన్ మోగుతున్నట్లే కనిపిస్తోంది. సరిహద్దుల్లో ఇప్పటికే భారీగా సైన్యాన్ని మోహరించి కవ్వింపు చర్యలకు దిగుతున్న పాకిస్తాన్ మరోవైపు యుద్ధానికి రెడీ అవుతోందని పక్కాగా తేలింది.

పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ సాగించిన రక్తపాతానికి భారత్ ప్రతీకార చర్యలకు దిగడం ఖ‌ాయమని పాకిస్తాన్ అంచనా వేస్తోంది. భారత్ వేసే అడుగులు యుద్ధానికి దారి తీయవచ్చని కూడా లెక్కలు కడుతోంది. ఒకవేళ పొరుగుదేశం యుద్ధం ప్రకటిస్తే ఎదుర్కోవడానికి ఇమ్రాన్ ఖాన్ సర్కార్ ముందస్తు చర్యలు చేపట్టింది. సైనికులకు కావలసిన వసతులను సిద్ధం చేయడంతో పాటు సరిహద్దు ప్రజలనూ అలెర్ట్ చేస్తోంది.

యుద్ధంలో గాయపడిన సైనికులకు తక్షణ వైద్యం అందేలా పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారత్‌తో జరిగే యుద్దంలో గాయపడే జవాన్లకు తగిన వైద్యసాయం అందించాలని క్వెట్టా కంటోన్మెంట్ బోర్డు స్థానిక ఆస్పత్రులకు లేఖ రాసింది. అలాగే 25 శాతం బెడ్స్ సైనికులకు కేటాయించాలంటూ ప్రైవేటు ఆస్పత్రులకు ఈ నెల 20న రాసిన ఈ లేఖ ఇప్పుడు బయటపడింది. సైనికులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో తగిన ప్రాథమచికిత్స అందించాక మిలటరీ హాస్పిటల్‌కు తరలించేలా పాక్ ఆర్మీ చర్యలు చేపట్టింది. అలాగే పాక్ మిలటరీ ఆస్పత్రుల్లో అదనపు పడకలు ఏర్పాటు చేస్తోంది.

ఇండియాతో యుద్ధం వచ్చే అవకాశం ఉందంటూ సరిహద్దు ప్రజలను , పాక్ ఆక్రమిత కశ్మీర్ వాసులను పాకిస్తాన్ ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి ఉండే నీలమ్, జీలమ్, రావల్‌కోట్ , హవేలి, కొట్లీ, భీం బెహర్ ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను తరలించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించింది. అలాగే సరిహద్దుల్లో బంకర్లు అందుబాటులో లేని ప్రజలు వెంటనే బంకర్లు ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచించింది. అంతేకాదు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఇళ్ళలో అత్యవసరమైతే తప్ప లైట్లు వెలిగించవద్దని కోరింది. అలాగే నియంత్రణ రేఖ దగ్గర్లోకి ఎవరూ వెళ్ళకూడదని పశువులను కూడా మేపవద్దని పాక్ ప్రభుత్వం సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories