భూకంపం వచ్చిందనుకున్నాం.. మెరుపు దాడిపై ప్రత్యక్షసాక్షులు

భూకంపం వచ్చిందనుకున్నాం.. మెరుపు దాడిపై ప్రత్యక్షసాక్షులు
x
Highlights

భారత వాయుసేన మెరుపు దాడులతో పీవోకే ఉలిక్కిపడింది. చెవులకు చిల్లుపడేలా పెద్దపెద్ద శబ్దాలతో మిరాజ్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించడంతో సమీప గ్రామాల...

భారత వాయుసేన మెరుపు దాడులతో పీవోకే ఉలిక్కిపడింది. చెవులకు చిల్లుపడేలా పెద్దపెద్ద శబ్దాలతో మిరాజ్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించడంతో సమీప గ్రామాల ప్రజలు ప్రాణభయంతో అర్ధరాత్రి ఉరుకులు పరుగులు పెట్టారు. భూకంపం వచ్చిందేమోనని భయంతో వణికిపోయారు. కొందరైతే ఎటుపోవాలో పాలుపోక రాత్రంతా జాగారం చేశారు.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించడంతో బాలాకోట్‌ ప్రాంతంలోని గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అర్ధరాత్రి మూడున్నర సమయంలో మిరాజ్ యుద్ధ విమానాలతో విరుచుకుపడటంతో సమీప గ్రామాల ప్రజలు అసలేం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

తమ నివాసాలకు సమీపంలోనే ఐదు బాంబు చప్పుళ్లను విన్నామని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పీవోకేలోని జబాటాప్‌ గ్రామంలో నివసించే మహ్మద్‌ అజ్మల్ మాట్లాడుతూ పెద్దపెద్ద శబ్దాలు వినిపించడంతో అసలేం జరుగుతుందో తమకు అర్ధం కాలేదని, భూకంపం వచ్చిందో లేక పెద్ద పిడుగు పడిందేమోనని భయపడ్డామన్నాడు. దాంతో మేమున్న ప్రాంతాన్ని ఖాళీ చేశామని, ఉదయం లేచాక చూస్తే పరిస్థితులన్నీ అల్లకల్లోలంగా ఉన్నాయని చెప్పకొచ్చాడు. చెట్లు కూలిపోయి ఇళ్లు ధ్వంసమయ్యాయని అలాగే ఒకచోట నాలుగు బాంబుల డబ్బాలు పడి ఉన్నాయని దాంతో ఇక్కడ బాంబు దాడులు జరిగాయని తమకు అర్ధమైందన్నాడు. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నదాని ప్రకారం భారత వాయుసేన దాడిలో ఉగ్ర స్థావరాలు నేలమట్టం కాగా, మిరాజ్ ఫైటర్ జెట్స్‌ మెరుపు వేగానికి సమీప గ్రామాలు ఉలిక్కిపడ్డాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories