టైమ్, ప్లేస్ చూసి కొడతాం: ఇమ్రాన్

టైమ్, ప్లేస్ చూసి కొడతాం: ఇమ్రాన్
x
Highlights

పుల్వామా ఉగ్ర దాడికి భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. మంగళవారం తెల్లవారుజామున మూడున్నరకి పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై యుద్ధ...

పుల్వామా ఉగ్ర దాడికి భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. మంగళవారం తెల్లవారుజామున మూడున్నరకి పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. నియంత్ర రేఖ దాటి వెళ్ళిన 12 మిరేజ్ యుద్ధ విమానాలతో బాంబు దాడి చేసింది. దాదాపు వెయ్యి కిలోల బాంబుల్ని టెర్రరిస్టు మూకలపై జరవిడిచిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఈ దాడి జరిగిన తరువాత అత్యవసరంగా నేషనల్ సెక్యూరిటీ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. నియంత్ర రేఖను భారత్ ఉల్లంఘించిందని పాక్ అభిప్రాయపడింది. భారత్ జరిపిన ఈ దాడిలో చాలా మంది చనిపోయారని చెబుతున్నదంత అబద్డమేనని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారత్ సర్కార్ మరోసారి నిర్లక్ష్యపూరితంగా, కేవలం తన సొంత ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించిందన్నారు. రానున్న ఎన్నికల వాతావరణం నేపథ్యంలో అందులో లబ్ధి కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. భారత్ దాడి చేసిన ప్రాంతాలు ప్రపంచానికంతటికీ త్వరలోనే అందుబాటులో ఉంచుతాం. వాళ్లే క్షేత్రస్థాయిలో వాస్తవాలు చూసుకోవచ్చని ఇమ్రాన్ అన్నారు. భారత అనవసరంగా ఈ దాడికి పాల్పడిందని ఇమ్రాన్ అన్నారు. దీనికి సరైన టైమ్, ప్లేస్ చూసి పాక్ స్పందిస్తుంది అని నేషనల్ సెక్యూరిటీ కమిటీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories