దాడి చేస్తారా...? మేము సిద్ధమే ‌: ఇమ్రాన్ ఖాన్

దాడి చేస్తారా...? మేము సిద్ధమే ‌: ఇమ్రాన్ ఖాన్
x
Highlights

పుల్వామా దాడితో తమకు సంబంధం లేదన్నారు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తామే ఉగ్రవాదుల బాధితులమని చెప్పారు. దాడి చేస్తారా మేమే సిద్ధమేనని అన్నారు...

పుల్వామా దాడితో తమకు సంబంధం లేదన్నారు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తామే ఉగ్రవాదుల బాధితులమని చెప్పారు. దాడి చేస్తారా మేమే సిద్ధమేనని అన్నారు ఇమ్రాన్. ఓ దేశం ఇలా చేసింది అలా చేసింది అని మరో దేశం ఎలా చెప్పగలుగుతుందని చెప్పారు. ఆరోపణలు కాదు ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. ఓ దేశం, ఓ జాతి మీద అన్యాయంగా ముద్ర వేస్తారా అని ప్రశ్నించారు. ఇండియా వైపు నుంచి ఎలాంటి దాడి జరిగినా పాకిస్థాన్ తిప్పికొడుతుందని చెప్పారు. యుద్ధం ప్రకటించడం, ప్రారంభించడం తేలికే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించాలని అన్నారు. సరిహద్దుల్లో ఇప్పుడిప్పుడే శాంతి, సామరస్యం నెలకొంటుందని చెప్పారు. పుల్వామా దాడి జరిగిన ఐదు రోజుల తర్వాత ఇమ్రాన్ స్పందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories