గ‌ర్జించిన మిరాజ్ ..

గ‌ర్జించిన మిరాజ్ ..
x
Highlights

పుల్వామా ఉగ్రదాడికి ప్రతిదాడితో భారత్ ప్రతీకారం తీర్చుకొంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 మిరాజ్ ఫైటర్ యుద్ధవిమానాల దళంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని...

పుల్వామా ఉగ్రదాడికి ప్రతిదాడితో భారత్ ప్రతీకారం తీర్చుకొంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 మిరాజ్ ఫైటర్ యుద్ధవిమానాల దళంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే ఉగ్రవాద శిబిరాలపై వందల కిలోల బాంబులతో దాడి చేసి 245 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. గ్వాలియర్, ఆగ్రాలోని విమానదళ కేంద్రాలలోని పన్నెండు మిరాజ్ విమానాలు కేవలం 30 నిముషాలలోనే సర్జికల్ స్ట్రయిక్స్-2ను విజయవంతంగా ముగించుకొని విజయవంతంగా తిరిగి వచ్చాయి. ఇప్పుడు దేశంలోని ప్రతి ఒక్కరి నోటా మిరాజ్ ఫైటర్ విమానాల మాటే వినిపిస్తోంది.

భారత విమానదళానికి గత 18 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న మిరాజ్ విమానాలకు మల్టీ రోల్ ఫైటర్లుగా గొప్ప పేరుంది. ఫ్రాన్స్ లోని దసాల్ట్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఈ యుద్ధవిమానాలు ప్రపంచంలోని తొమ్మిది దేశాల విమానదళాలకు దన్నుగా నిలుస్తూ వస్తున్నాయి. స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో రూపొందించిన ఈ ఒక్కో ఫైటర్ ధర 195 కోట్ల రూపాయలు మాత్రమే. అంతేకాదు సింగిల్ ఇంజన్ తో తయారు చేసిన ఈ సింగిల్ పైలట్ విమానం బరువు 7 వేల 500 కిలోలు ఉంటుంది.

గంటకు 2 వేల 530 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే మిరాజ్ కు 3 వేల 330 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపైన సైతం దాడి చేసే సామర్థ్యం ఉంది. అంతేకాదు 56 వేల అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తూ శుత్రురాడార్ లకు దొరకకుండా చొచ్చుకుపోయే సత్తా కూడా మిరాజ్ సొంతం. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద విమానదళంగా పేరుపొందిన భారత్ వాయుసేనలో 51 మిరాజ్ విమానాలు ఉన్నాయి. వీటిలో కేవలం రెండు విమానాలను మాత్రమే అత్యాధునిక టెక్నాలజీతో అప్ గ్రేడ్ చేయగలిగారు. మరో 49 విమానాలను అప్ గ్రేడ్ చేయించాల్సి ఉంది. ఒక్కో విమానం ఆధునీకరించడానికే 344 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేయాల్సి ఉంది.

భారత విమానదళంలోని మిగ్ విమానాల సర్వీసు ముగింపుదశకు చేరడంతో వాటి స్థానంలో ఫ్రెంచ్ దసాల్ట్ తయారీ రాఫెల్ విమానాలను సమకూర్చుకోడానికి భారత్ ఇప్పటికే భారీకాంట్రాక్టు కుదుర్చుకొన్నసంగతి తెలిసిందే. ఏది ఏమైనా ఈరోజు మిరాజ్ యుద్ధవిమానాల రోజు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories