చంద్రగిరిలో 50 శాతం దాటిన రీ పోలింగ్‌

చంద్రగిరిలో 50 శాతం దాటిన రీ పోలింగ్‌
x
Highlights

చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరుగుతున్న ఏడు కేంద్రాల్లో పోలింగ్ శాతం అంతకంతకు పెరుగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో ఓటర్లు...

చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరుగుతున్న ఏడు కేంద్రాల్లో పోలింగ్ శాతం అంతకంతకు పెరుగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు తరలివస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఏడు కేంద్రాల పరిధిలో 51.40 శాతం పోలింగ్ నమోదైంది. వెంకట్రామాపురంలో ఇప్పటి వరకు 80 శాతం ఓటింగ్‌‌ నమోదుకాగా కమ్మపల్లి మినహా అన్ని చోట్ల పోలింగ్‌ 50 శాతం దాటింది. మొత్తం 5 వేల 451 మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకు 2వేల 802 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది పరిస్ధితిని స్వయంగా సమీక్షించారు. సచివాలయంలోని కమాండ్ కంట్రోల్ నుంచి ఏడు కేంద్రాల్లోని పోలింగ్ తీరును పరిశీలించారు. ఇక ప్రధాన పార్టీలైన వైసీపీ,టీడీపీ పోలింగ్ లెక్కలు వేసుకుంటున్నాయి. రీ పోలింగ్ కేంద్రాల దగ్గర మకాం వేసిన సీనియర్ నేతలు పరిస్ధితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటున్నారు. కమ్మపల్లె పోలింగ్‌ కేంద్రం దగ్గర ఓటు వేయించే విషయంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నా పోలీసులు వెంటనే జోక్యం చేసుకోవడంతో సద్ధుమణిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories