రేపు చలో ఇంటర్‌ బోర్డు: అఖిలపక్ష నేతల నిర్ణయం

రేపు చలో ఇంటర్‌ బోర్డు: అఖిలపక్ష నేతల నిర్ణయం
x
Highlights

ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రతిపక్షాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నాయి. ఈ నెల 29న ఇంటర్ బోర్దు వద్ద ధర్నా చేయనున్నాయి. త్రిసభ్య కమిటీ రిపోర్టు అందిన తర్వాత...

ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రతిపక్షాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నాయి. ఈ నెల 29న ఇంటర్ బోర్దు వద్ద ధర్నా చేయనున్నాయి. త్రిసభ్య కమిటీ రిపోర్టు అందిన తర్వాత కూడా ప్రభుత్వం ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోకపోవడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. తెలంగాణ లో ఇంటర్ ఫలితాల మంటలు చల్లారడం లేదు. రిజల్ట్స్ గందరగోళం, కొందరు విద్యార్థుల ఆత్మహత్యలపై ఇంటర్ బోర్డు వద్ద విద్యార్థి, యువజన సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆందోళనను ప్రతిపక్షాలు మరింత ఉధృతం చేయనున్నాయి.

హైదరాబాద్ లోని మగ్ధుమ్ భవన్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి లు హాజరయ్యారు. త్రిసభ్య కమిటీ రిపోర్టు అందిన తర్వాత కూడా ఎవ్వరిపై చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. ఈ నెల 29న ఇంటర్ బోర్డు వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనలను పోలీసులు భగ్నం చేస్తున్నారు. ఆందోళనకారులను బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిలపక్షం ధర్నాకు పోలీసుల పర్మిషన్ లభిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories