యునైటెడ్ ఇండియా ర్యాలీ.. బీజేపీకి దీదీ చెక్‌ !

యునైటెడ్ ఇండియా ర్యాలీ.. బీజేపీకి దీదీ చెక్‌ !
x
Highlights

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం గడువు ఇక ముగిసిపోయిందని, త్వరలోనే ఈ దేశ ప్రజలు మోడీని సాగనంపుతారని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. దీదీ నేతృత్వంలో కోల్‌కతా వేదికగా ప్రతిపక్షాల భారీ ఐక్యతా ర్యాలీ జరిగింది.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం గడువు ఇక ముగిసిపోయిందని, త్వరలోనే ఈ దేశ ప్రజలు మోడీని సాగనంపుతారని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. దీదీ నేతృత్వంలో కోల్‌కతా వేదికగా ప్రతిపక్షాల భారీ ఐక్యతా ర్యాలీ జరిగింది. దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీ నేతలు ఈ ర్యాలీకి హాజరై మోడీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో కోల్ కతాలో నిర్వహించిన యునైటెడ్ ఇండియా బహిరంగ సభకు విశేష స్పందన లభించింది. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బహిరంగ సభలో వివిధ పార్టీల అగ్రనేతలు పాల్గొన్నారు. కేంద్రం తీరును ఎండగట్టారు. విపక్షాల ఐక్యతను చూసి మోడీ ప్రభుత్వం బెంబేలెత్తుతోందన్నారు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ. సమష్టి నాయకత్వం ప్రస్తుత తరుణంలో దేశానికి అవసరమన్నారు. కేంద్ర సర్కార్ ఇక రోజులు లెక్కపెట్టుకోవచ్చని ఆమె గర్జించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు మోడీ అమిత్‌షా లు ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. 2019 ఎన్నికలు దేశ ప్రధానిని ఎన్నుకునే ఎన్నికలు కావని 2019 ఎన్నికలు మోడీ అమిత్‌ షాలను తరిమికొట్టే ఎన్నికలని కేజ్రీవాల్ అన్నారు.

మోడీ తన కార్పేరేట్ మిత్రుల కోసమే పనిచేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.దేశంలో రైతులు చనిపోతున్నా మోడీ చలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్‌కత్తా ర్యాలీలో పాల్గొన్న సిన్హా ద్వయం మోడీని ఘాటుగా విమర్శించారు. జీఎస్టీ కారణంగా దేశంలో చాలా మంది నష్టపోయారని చిన్న చిన్న బట్టల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని శతృఘ్న సిన్హా విమర్శించారు. గత నాలుగున్నరేళ్లుగా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని బీజేపీ నేతలు ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్నారని యశ్వంత్ సిన్హా మండిపడ్డారు.

విపక్ష కూటమిపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆర్జేడీ నేత తేజస్వి మండిపడ్డారు. భిన్నత్వంలోనే ఏకత్వం ఉందని అదేదే మన దేశపు సౌందర్యమని తేజస్వి అన్నారు. తదుపరి సభను ఢిల్లీలోనా లేక ఏపీ, కర్ణాటకలో నిర్వహించాలా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ విషయమై నేతలు ఒక నిర్ణయానికి రానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories